AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Inter 2020 Exam Fee: ఏపీ ఇంటర్ విద్యార్థుల పరీక్ష ఫీజు వివరాలను రిలీజ్ చేసిన బోర్డు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే

రోనా నేపథ్యంలో విద్యార్థులకు ఆన్ లైన్ లోనే క్లాస్ లను అందించిన ప్రభుతం తాజాగా 2020-21 ఏడాదికి గాను పరీక్షను నిర్వహించడానికి రంగం సిద్ధం చేస్తోంది. తాజాగా ఏపీ ఇంటర్ బోర్డు పరీక్ష ఫీజులపై కీలక ప్రకటన..

AP Inter 2020 Exam Fee: ఏపీ ఇంటర్ విద్యార్థుల పరీక్ష ఫీజు వివరాలను రిలీజ్ చేసిన బోర్డు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే
Surya Kala
|

Updated on: Feb 17, 2021 | 2:18 PM

Share

AP Inter 2020 Exam Fee: కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ఆన్ లైన్ లోనే క్లాస్ లను అందించిన ప్రభుతం తాజాగా 2020-21 ఏడాదికి గాను పరీక్షను నిర్వహించడానికి రంగం సిద్ధం చేస్తోంది. తాజాగా ఏపీ ఇంటర్ బోర్డు పరీక్ష ఫీజులపై కీలక ప్రకటన చేసింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కు సంబంధించిన అన్ని రకాల ఫీజుల వివరాలను అందించింది. ఫీ, లాస్ట్ సంబంధించిన వివరాలను అధికారులు తెలిపారు.

ఇంటర్ పరీక్ష అప్లికేషన్ ధర రూ. 10 గా నిర్ణయించారు. ఇక జనరల్ కోర్సు కు సంబంధించిన ఎగ్జామ్ ఫీజును రూ. 490 గా నిర్ణయించింది. ఒకేషనల్ అభ్యర్థులు పరీక్ష ఫీజు రూ. 680 లని అధికారులు ప్రకటించారు ఇక జనరల్? ఒకేషనల్ బ్రిడ్జ్ కోర్సు సబ్జెక్టుల ఫీజును రూ. 135 గా

ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ బ్యాక్ లాగ్ అభ్యర్థులు ప్రాక్టికల్ పరీక్షకు హాజయ్యేందుకు రూ. 190 లను చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. పరీక్షకు హాజరుకావాలనుకునే అభ్యర్థులు మార్చి 1 వ తేదీలోగా ఫీజులను చెల్లించాలని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అంతేకాదు ఆఖరు తేదీ పొడిగించేది లేదని ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు.  విద్యార్థి ఆన్‌లైన్ ద్వారా నేరుగా పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.

Also Read:

బ్యాలెట్‌ పత్రంలో గుర్తు కనిపించడం లేదంటూ పోలింగ్‌ కేంద్రం వద్ద అభ్యర్థి ఆందోళన