Jawan Jaswant Reddy: దేశరక్షణ పోరులో అమర జవాన్‌కు ఘన నివాళి.. రూ.50 లక్షల ఆర్థిక సాయం అందించిన ఏపీ సర్కార్

భరత మాత పోరులో వీర మరణం పొందిన జస్వంత్ రెడ్డి భౌతికకాయానికి హోంమంత్రి సుచరిత నివాళులర్పించారు.

Jawan Jaswant Reddy: దేశరక్షణ పోరులో అమర జవాన్‌కు ఘన నివాళి.. రూ.50 లక్షల ఆర్థిక సాయం అందించిన ఏపీ సర్కార్
Home Minister Sucharitha
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Balaraju Goud

Updated on: Jul 10, 2021 | 12:07 PM

Jawan Jaswant Reddy funerals in Bapatla: భరత మాత పోరులో వీర మరణం పొందిన జస్వంత్ రెడ్డి భౌతికకాయానికి హోంమంత్రి సుచరిత నివాళులర్పించారు. దేశ రక్షణ కోసం తన ప్రాణాలు ఇవ్వడం.. జస్వంత్ త్యాగం మరవలేనిదన్నారు. అతి చిన్న వయసులోనే వీర జవాన్ జస్వంత్ రెడ్డి మరణించటం బాధాకరమని, దేశం కోసం బిడ్డ ప్రాణాలు ఇచ్చి ఆ తల్లిదండ్రుల జన్మ చరితార్థమని కొనియాడారు సుచరిత. జస్వంత్ కుటుంబసభ్యులకు ప్రభుత్వ తరపున రూ. 50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందన్నారు. తమ్ముళ్ల కోసం జస్వంత్ నిరంతరం ఆలోచించేవాడని.. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున జస్వంత్ కుటుంబానికి అండగా ఉంటామని హోంమంత్రి సుచరిత తెలిపారు.

శత్రువు తూటా లోంచి.. గుళ్ల వర్షం కురుస్తున్నా.. తన గుండెను చీల్చుకుంటూ బుల్లెట్లు వెళ్తున్నా.. ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. రెట్టింపు ఉత్సాహంతో తిరగబడ్డాడు. మన జవాన్లు చూపిన తెగువకు 4 ఉగ్రవాదులు మట్టిలో కలిసిపోయారు. కానీ జశ్వంత్ రెడ్డితో పాటు మరో జవాన్ అమరుడయ్యాడు. రాజౌరి సెక్టార్‌లో టెర్రరిస్టులతో జరిగిన పోరులో ఎదురొడ్డి పోరాడాడు జశ్వంత్‌రెడ్డి. ఉగ్రవాదులపై బులెట్ల వర్షం కురిపించాడు. ఆ శత్రు మూకల.. అడుగు దేశం లోపల పడకుండా కాల్చి చంపాడు. అదే ప్రయత్నంలో తానూ అమరుడయ్యాడు జశ్వంత్‌రెడ్డి. అభిమానులు, బంధుమిత్రుల అశ్రునయాల నడుమ ఆర్మీ జవాన్‌ జశ్వంత్‌రెడ్డి అంతిమయాత్ర కొనసాగింది. బాపట్ల సమీపంలోని జవాన్ స్వగ్రామమైన ధరివాదకొత్తపాలెంలో.. సైనిక లాంఛనాలతో జవాన్‌కు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి సుచరితతో పాటు డిప్యూటీ స్పీకర్ కొన రఘుపతి, కలెక్టర్ వివేక్ యాదవ్, ఎస్పీ విశాల్ గున్ని.. వీర జవాన్ జస్వంత్ భౌతికకాయానికి నివాళులర్పించారు.

18 ఏళ్లు నిండగానే ఇంకేవో ఉన్నత చదువులు, ఉద్యోగాల ఆలోచన లేకుండా.. సైన్యం వైపు చూశాడు జశ్వంత్‌. అనుకున్నట్లుగానే సెలక్ట్ అయ్యాడు. 2016 బ్యాచ్‌లో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఫస్ట్ పోస్టింగ్‌ నీలగిరిలో చేశాడు. ఆ తర్వాత ఈ యంగ్‌ తరంగ్‌ని జమ్ముకశ్మీర్‌కి పంపింది ఆర్మీ. బోర్డర్‌లో పోస్టింగ్ అన్నా జంకులేకుండా వెళ్లాడు. చివరికి ఇలా దేశం కోసం ప్రాణత్యాగం చేశాడు జశ్వంత్‌రెడ్డి.

Read Also…  AP Deputy CM: జ‌గ‌న్‌, ష‌ర్మిల మ‌ధ్య విభేదాలు లేవు.. జ‌గ‌న్‌కు ఆంధ్ర, తెలంగాణ తేడాలుండవుః నారాయ‌ణ స్వామి