AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో కరోనా పరిస్థితులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. కోవిడ్ కేర్ సెంటర్లు, బెడ్లు పెంచాలని ఆదేశాలు..

AP High Court: ఏపీలో కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా చికిత్సలు సక్రమంగా అందడం లేదంటూ..

ఏపీలో కరోనా పరిస్థితులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. కోవిడ్ కేర్ సెంటర్లు, బెడ్లు పెంచాలని ఆదేశాలు..
Ravi Kiran
|

Updated on: May 06, 2021 | 5:23 PM

Share

AP High Court: ఏపీలో కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా చికిత్సలు సక్రమంగా అందడం లేదంటూ సామాజిక కార్యకర్త తోట సురేశ్‌బాబు, ఏపీసీఎల్‌ఏ వేసిన పిల్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. అనంతపురం ఆసుపత్రిలో కోవిడ్ మరణాలపై రిపోర్టు సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా రాష్ట్రానికి అవసరమైన ఆక్సిజన్ ఇచ్చేలా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆక్సిజన్ దూర ప్రాంతాల నుంచి కాకుండా రాష్ట్రానికి దగ్గరగా ఉన్న బళ్లారి, తమిళనాడు నుంచి సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

కరోనా రోగులకు ప్రాణాదారమైన ఆక్సిజన్ స్వయం ఉత్పత్తికి ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేదని మొన్న అఫిడవిట్‌లో పేర్కొన్నారని.. ఇప్పుడు ఆక్సిజన్‌ బెడ్లు ఖాళీ లేవని నోడల్‌ అధికారులే చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ అఫిడవిట్‌లో లెక్కలకు, వాస్తవ పరిస్థితికి పొంతన లేదని ఆక్షేపించింది. కరోనా కేసులు పెరుగుతున్నందున ఆ మేరకు కరోనా టెస్టింగ్‌, ట్రీట్మెంట్‌ సెంటర్లు, ఆస్పత్రుల్లో బెడ్లు పెంచాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నోడల్ అధికారులు రోజుకు 24 గంటలు అందుబాటులో ఉండాలని హైకోర్టు పేర్కొంది. వీలైనన్ని ఎక్కువ టెస్టులు చేసేలా సౌకర్యాలు పెంచాలని ప్రభుత్వానికి సూచించింది.

కరోనా నియంత్రణకు రాష్ట్ర సర్కారు తీసుకున్న చర్యలను ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. పడకల లభ్యత, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఫీజుల వసూలు అంశాలపై హైకోర్టు విచారణ చేపట్టింది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియపై హైకోర్టు ఆరా తీసింది. 45 ఏళ్ల లోపు వారికి ఎపుడు వ్యాక్సిన్ వేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. అందరికి వ్యాక్సిన్ వేయటంలో ఏమి ఇబ్బందులు కోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణ వెకేషన్ బెంచ్ కోర్టుకు వాయిదా వేసింది.

ఇవి చదవండి:

ఏపీ ప్రజలకు ముఖ్య అలెర్ట్.. బ్యాంక్ టైమింగ్స్ లో మార్పులు.. వివరాలివే..

Viral News: గగుర్పొడిచే దృశ్యం.. ఒకే చోట కుప్పలు తెప్పలుగా చేరిన పాములు.. వీడియో వైరల్.!

ఈ ఫోటోలో ఎరను వేటాడేందుకు చిరుతపులి నక్కింది.. అది ఎక్కడ ఉందో కనిపెట్టగలరా.?