AP High Court: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ నిర్ణయంపై ఉత్కంఠ.. రేపు తీర్పు వెలువరించనున్న హైకోర్ట్

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ తర్వాత ఫలితాల విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది.

AP High Court: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ నిర్ణయంపై ఉత్కంఠ.. రేపు తీర్పు వెలువరించనున్న హైకోర్ట్
Ap High Court
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 26, 2021 | 8:02 PM

AP MPTC, ZPTC Elections Counting: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ తర్వాత ఫలితాల విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించనుంది. సుప్రీం ఆదేశాలు పాటించలేదంటూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ను సింగిల్ బెంచ్ ఏపీ హైకోర్టు ధర్మసం రద్దు చేసింది. దీంతో సింగిల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇప్పటికే డివిజన్ బెంచ్‌లో వాద ప్రతి వాదనలు ముగిశాయి. రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాల లెక్కింపుపై తీర్పు వెలువరించనుంది ఏపీ హైకోర్టు. దీంతో తుది తీర్పు రానున్న సందర్భంలో కౌంటింగ్‌పై ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు, కౌటింగ్ నిలిపివేతతో మండల, జిల్లా పరిషత్ లలో పాలనపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో ప్రభుత్వం ఇప్పటికే కొనసాగుతున్న ప్రత్యేకాధికారుల పాలనను మరో ఆరునెలల పాటు పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు వరుసగా ప్రత్యేకాధికారుల పాలన కొనసాగింపుపై స్ధానికంగా ఉన్న నేతలు, తాజాగా జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధుల్లోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Read Also… 

Goreti Venkanna: అంబేద్కర్ తర్వాత ఆ ఘనత సీఎం కేసీఆర్‌దే.. దళిత బంధుపై ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న ఆసక్తికర వ్యాఖ్యలు