Student Suicide: ప్రియుడు అనుమానించాడని.. బీటెక్ విద్యార్థిని బలవన్మరణం.. ఉరివేసుకుని..
Vijayawada Student Suicide: ప్రియుడు అనుమానించాడన్న నేపంతో.. ప్రియురాలు మనస్థాపానికి గురైంది. అనంతరం ప్రియుడి మీద కోపంతో ఇంజనీరింగ్ చదవుతున్న
Vijayawada Student Suicide: ప్రియుడు అనుమానించాడన్న నేపంతో.. ప్రియురాలు మనస్థాపానికి గురైంది. అనంతరం ప్రియుడి మీద కోపంతో ఇంజనీరింగ్ చదవుతున్న విద్యార్థిని ఆత్మాహత్య చేసుకుంది. ఈ సంఘటన విజయవాడలో కలకలం రేపింది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన యువతి విజయవాడలోని ఓ ప్రముఖ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతోంది. ఈ క్రమంలో విజయవాడలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న యువకుడితో ప్రేమలో పడింది. వారిద్దరూ కలిసి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. దీంతో యువతి 20 రోజులుగా యువకుడి రూంలో కలిసి ఉంటుంది. ఈ తరుణంలో వారిద్దరి మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది. యువకుడు అనుమానించడాన్ని జీర్ణించుకోలేని విద్యార్థిని.. సోమవారం ఉరివేసుకుంది. గమనించిన ప్రియుడు ఆమెను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి.. పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అనంతరం విద్యార్థిని పరిస్థితి విషమించడంతో.. మరణించిందని పోలీసులు పేర్కొన్నారు. సంఘటనా స్థలం నుంచి సూసైడ్ నోట్ లభ్యమైంది. దీనిలో పలు విషయాలను రాసి ఆ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
కాగా.. విద్యార్థిని ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. అయితే.. ఉరి వేసుకున్న విద్యార్థిని.. ప్రభుత్వాసుపత్రిలో చేర్చి ప్రియుడు మాచవరం పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు. ఇదిలాఉంటే.. విద్యార్థినిని కొట్టి చంపాడని మృతురాలి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: