Chandrababu Naidu: చంద్రబాబుకు మధ్యంతర బెయిల్.. ఆస్పత్రిలో ఉండేందుకు మాత్రమే అనుమతి
Chandrababu Naidu Interim Bail: స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. చంద్రబాబు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై సోమవారం విచారణ పూర్తిచేసిన ఏపీ హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు తీర్పు వెల్లడించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏసీబీ కోర్టు బెయిలు ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్య కారణాలరీత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిలు మంజూరు చేయాలని అనుబంధ పిటిషన్ వేశారు.

స్కిల్ కేసులో తెలుగు దేశం పార్టీ(టీడీపీ) అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ లభించింది. నాలుగు వారాలు బెయిల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. అనారోగ్య కారణాలతో బెయిల్ కోరారు చంద్రబాబు. సరిగ్గా 52 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో ఉన్నారు. స్కిల్ స్కామ్‌లో సెప్టెంబర్ 9న చంద్రబాబు అరెస్టు అయ్యారు. సెప్టెంబర్ 10న రాజమండ్రి జైలుకు వచ్చారు చంద్రబాబు.
చంద్రబాబు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు తరఫున న్యాయవాధి. ఆరోగ్యం బాగోలేనందున బెయిల్ ఇవ్వాలన్నారు లాయర్లు. 3నెలల క్రితమే ఎడమ కంటికి ఆపరేషన్ జరిగిందని రిపోర్టులో పేర్కొన్నారు. కుడి కంటికి ఆపరేషన్ చేయాల్సి ఉందని కోర్టును అభ్యర్థించారు బాబు లాయర్లు. ఒళ్లు నొప్పులు, దద్దుర్లతో చంద్రబాబు ఇబ్బందులు పడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. బ్లడ్, లివర్, యూరిన్, హెచ్‌బీ a1c, ECG, 2D ఎకో పరీక్షలు చేయాల్సి ఉంది. ఇవన్నీ సర్టిఫైడ్ ఇన్‌స్టిట్యూట్‌లోనే చేయాల్సి ఉందంటున్నారు పిటిషన్.
లైవ్ వీడియో కోసం ఇక్కడ చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
