Chandrababu Naidu: చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై నేడే తీర్పు.. లైవ్ వీడియో

Chandrababu Naidu: చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై నేడే తీర్పు.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Oct 31, 2023 | 9:50 AM

స్కిల్‌ స్కాం కేసులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును వరసు కేసులు చుట్టుముడుతున్నాయి. ఒక కేసు నుంచి బయటపడకముందే మరో కేసు నమోదవుతోంది. స్కిల్‌ కేసు, ఐఆర్‌ఆర్‌, ఫైబర్‌నెట్‌, అంగళ్ల కేసులకు సంబంధించి కోర్టుల్లో విచారణ జరుగుతుండగానే తాజాగా మరో కేసు నమోదు చేసింది సీఐడీ. టీడీపీ ప్రభుత్వంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారనే ఆరోపణలపై కేసు నమోదు చేసింది.

స్కిల్‌ స్కాం కేసులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును వరసు కేసులు చుట్టుముడుతున్నాయి. ఒక కేసు నుంచి బయటపడకముందే మరో కేసు నమోదవుతోంది. స్కిల్‌ కేసు, ఐఆర్‌ఆర్‌, ఫైబర్‌నెట్‌, అంగళ్ల కేసులకు సంబంధించి కోర్టుల్లో విచారణ జరుగుతుండగానే తాజాగా మరో కేసు నమోదు చేసింది సీఐడీ. టీడీపీ ప్రభుత్వంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారనే ఆరోపణలపై కేసు నమోదు చేసింది. సీఐడీ పిటిషన్‌తో ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది. చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఇవాళ ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. చంద్రబాబు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మధ్యంతర బెయిల్ ఇవ్వాలని గతంలో బాబు తరపు లాయర్లు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం వాదనలు జరిగాయి. చంద్రబాబు కంటికి ఆపరేషన్ కూడా చెయ్యాలని వైద్యులు సూచించారంటూ కోర్టుకు విన్నవించారు ఆయన తరపు లాయర్లు. దీనిపై ఇవాళ కోర్టు తీర్పును వెల్లడించనుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

60 ఏళ్ల చరిత్రకు ముగింపు.. ఈ ట్యాక్సీలను ఇక చూడలేం

వాళ్లను వదిలేయండి .. ఇజ్రాయెల్‌ అధ్యక్షుడికి జో బైడెన్‌ ఫోన్

ప్రాణం తీసిన స్టంట్‌ !! ఇలాంటి కార్యక్రమాలు నిషేధించాలంటూ నెటిజన్లు డిమాండ్‌

తను చనిపోతూ 48 మంది ప్రాణాలను కాపాడిన బస్సు డ్రైవర్

పాక్‌ నుంచి భారత్‌కు రానున్న అంజు.. మీడియాకు తెలిపిన ఆమె భర్త నస్రుల్లా