AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Free Gas: ఏపీలో ఉచిత గ్యాస్‌ సిలిండర్ కావాలంటే గైడ్‌లైన్స్ ఇవే…

ఉచిత గ్యాస్ పథకం అమలపై కీలక అప్డేట్‌ ఇచ్చింది ఏపీ సర్కార్‌. ఇప్పటికే పథకం అమలుకు ముహూర్తంగా ఫిక్స్ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు గైడ్‌లైన్స్ విడుదల చేసింది. వాటి ఆధారంగా అర్హులు ఎవరో తెలిసిపోయింది.

AP Free Gas: ఏపీలో ఉచిత గ్యాస్‌ సిలిండర్ కావాలంటే  గైడ్‌లైన్స్ ఇవే...
Andhra Free Gas Cylinder Scheme
Ram Naramaneni
|

Updated on: Oct 26, 2024 | 8:42 AM

Share

ఏపీలో ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పంపిణీకి విధివిధానాలను ఖరారు చేశారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్‌ పంపిణీ ప్రారంభం కానుంది. ఈనెల 29 ఉదయం 10 గంటల నుంచి బుకింగ్స్ ప్రారంభం అవుతాయి. 31వ తేదీ నుంచి డెలివరీ ప్రారంభిస్తారు. బుకింగ్ కన్ఫర్మ్ అయ్యాక పట్టణాల్లో 24గంటలు, గ్రామాల్లో 48గంటల్లో సిలిండర్ డెలివరీ అవుతోంది.

గ్యాస్ సిలిండర్ ధర రూ.876

ఏటా మూడు సిలిండర్లను లబ్దిదారులకు అందిస్తారు. ప్రస్తుతం ఇంట్లో ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధర రూ.876 కాగా.. సిలిండర్‌ ధరను లబ్ధిదారులు డెలివరీ సమయంలో చెల్లిస్తే.. వాటిని 48 గంటల్లో డబ్బులు తిరిగి వారి బ్యాంక్‌ అకౌంట్‌లో జమ చేస్తారు.

మొదటి సిలిండర్ మార్చి 31 లోపు

ప్రభుత్వం అందజేసే మూడు ఉచిత సిలిండర్లలో మొదటి సిలిండర్ మార్చి 31 లోపు, రెండోది జూలై 31 లోపు, మూడోది నవంబరు 30 లోపు ఎప్పుడైనా పొందవచ్చు. ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందేందుకు అర్హత కలిగిన ఎల్పీజీ కనెక్షన్ ఉండాలి. తెల్ల రేషన్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు ఉండాలి. అన్ని అర్హతలూ ఉండి ఉచిత సిలిండర్ రాకపోతే.. టోల్ ఫ్రీ నెంబర్‌-1967 ఫోన్‌చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఇక ప్రస్తుతం ఏపీలో కోటి 55 లక్షల గ్యాస్ కనెక్షన్లు… 1.47 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో అర్హులందరికీ సిలిండర్‌ అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

గ్యాస్‌ డెలివరీ చేయడానికి రూ. 894.92కోట్లు

ఇక గ్యాస్‌ డెలివరీ చేయడానికి రూ. 894.92కోట్ల రుపాయల నగదును అక్టోబర్ 29వ తేదీన అడ్వాన్సుగా ఆయిల్ కంపెనీలకు చెల్లించనుంది ప్రభుత్వం. ఈ పథకానికి ఏడాదికి రూ.2,684 కోట్ల వరకు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అదే ఐదేళ్లలో మొత్తం రూ.13,423 కోట్లు అవుతుందని చెబుతున్నారు. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నాలుగు నెలలకు ఓ సిలిండర్‌ చొప్పున ఉచితంగా అందిస్తారు. మొత్తంగా మహిళలకు ఏపీ ప్రభుత్వం దీపావళి కానుక అందిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..