Andhra: ఏపీ విద్యార్ధులకు అద్దిరిపోయే స్వీట్ న్యూస్.. ఇది కదా కావాల్సింది
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో కీలక ఎన్నికల హామీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘‘తల్లికి వందనం’’ పథకం అమలు కోసం ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో కీలక ఎన్నికల హామీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘‘తల్లికి వందనం’’ పథకం అమలు కోసం ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 67 లక్షలకుపైగా తల్లులకు మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం నేరుగా నిధులు జమ కాబోతున్నాయి. ఇందుకోసం రూ. 8745 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేస్తూ జూన్ 12 నాటికి తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేయనుంది.
తల్లికి వందనం – మేనిఫెస్టో హామీ నుంచి ఆచరణ దాకా
“పిల్లల చదువు తల్లుల బాధ్యతగా మాత్రమే కాక, ప్రభుత్వం భాగస్వామిగా ఉండాలి” అనే భావనకు ప్రతీకగా ఈ పథకాన్ని ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రకటించింది. “ఎంత మంది పిల్లలు ఉంటే, అంత మందికీ తల్లులకు నిధులు ఇవ్వడం” అన్నది ఈ పథకం మూలం. ఇప్పుడు అదే ప్రకారం 67,27,164 మంది విద్యార్థుల తల్లులకు నిధులు అందబోతున్నాయి.
1వ తరగతి నుంచి ఇంటర్ వరకు
ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే, అది 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లల తల్లులనుండి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థుల తల్లుల వరకూ వర్తిస్తుంది. పాఠశాలల్లో, కళాశాలల్లో అడ్మిషన్లు పూర్తయిన తర్వాత వారి వివరాలు ప్రభుత్వం వద్దకు వచ్చిన వెంటనే ఆయా తల్లుల ఖాతాల్లో డబ్బు నేరుగా జమ అవుతుంది. ప్రతి విద్యార్థి గురించి తల్లికి గుర్తింపు ఉండేలా విధివిధానాలపై జీఓ మంగళవారం విడుదలైంది.
వివరాల్లోకి వెళితే – బడ్జెట్, లక్ష్యాలు
మొత్తం లబ్దిదారుల సంఖ్య: 67,27,164 మంది విద్యార్ధులు
మొత్తం నిధులు: రూ. 8745 కోట్లు
అమలు తేదీ: జూన్ 12, 2025
కవరేజీ: అన్ని ప్రభుత్వ, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు
సూపర్ సిక్స్: మరో మైలురాయి చేరిన ప్రభుత్వం
ఇప్పటికే కూటమి ప్రభుత్వం తన “సూపర్ సిక్స్” హామీల్లో నాలుగింటిని అమలులోకి తీసుకొచ్చింది:
1. పింఛన్ల పెంపు
2. అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ
3. మెగా DSC నోటిఫికేషన్
4. దీపం–2 పథకం
ఇప్పుడు ఐదో హామీగా “తల్లికి వందనం” అమలవుతోంది. ఇది కేవలం ఆర్థిక సహాయంగా కాక, తల్లి పాత్రకు నూతన గౌరవం ఇచ్చే చర్యగా ప్రజల్లో భావింపబడుతోంది.