Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బైక్‌పై వెళ్తుండగా రోడ్డుపై దొరికిన బ్యాగ్‌.. ఓపెన్‌ చేసి చూడగా బ్యాగ్‌ నిండా నగలు, డబ్బుల కట్టలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ప్రస్తుత కాలంలో ఎక్కడైనా పది రూపాయలు దొరికితే ఠక్కున జేబులో వేసుకునే మనుషులు ఉన్న ఈ రోజుల్లో రోడ్డుపై బంగారం, వెండి, డబ్బుల కట్టలతో దొరికిన ఓ బ్యాగ్‌ను పోలీస్‌ స్టేషన్‌లో ఇచ్చి మానవత్వం చాటుకున్నారు ముగ్గురు యువకులు. అందరిలా డబ్బులు కనిపించిన వెంటనే తీసుకొని పారిపోకుండా పీఎస్‌లో అప్పగించిన వారి నిజాయితిని పోలీసులు మెచ్చుకున్నారు. ఇంతకు ఆ యువకులు ఎవరు.. ఇది ఎక్కడ జరిగిందో తెలుసుకుందా పదండి.

బైక్‌పై వెళ్తుండగా రోడ్డుపై దొరికిన బ్యాగ్‌.. ఓపెన్‌ చేసి చూడగా బ్యాగ్‌ నిండా నగలు, డబ్బుల కట్టలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Kurnool
Follow us
J Y Nagi Reddy

| Edited By: Anand T

Updated on: Jun 11, 2025 | 6:42 PM

ప్రస్తుత కాలంలో ఎక్కడైనా పది రూపాయలు దొరికితే ఠక్కున జేబులో వేసుకుంటాం.. అదే కట్టల కట్టలు డబ్బులు దొరికితే.. బంగారం ఉన్న బ్యాగ్ దొరికితే.. అందులో మరి దొంగతనం చేకుండా రోడ్డుపై దొరికితే.. ఆది ఎవరిదో తెలియకుండా ఉంటే.. ఇలా ఇన్ని రకాలుగా ప్లస్ పాయింట్స్ ఉంటే కొందరు అయితే ఎగిరి గంతులు వేస్తారు. కానీ ఇక్కడ ఓ ముగ్గురు యువకులు మాత్రం అలా చేయలేదు. వారికీ దొరికిన బంగారం బ్యాగ్‌ను ఎంతో నిజాయితీగా.. నిబద్ధతతో పోలీస్ స్టేషన్‌లో అప్పగించి వివరాలు ఇచ్చి మరీ వచ్చారు. మనుషుల్లో మానవత్వం ఇంకా ఉందని.. మంచి మనసున్న మనుషులు ఇంకా ఉన్నారని నిరూపితం చేసిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన సోహెల్, వలి ,నరసింహులు ముగ్గురు యువకుడు పని నిమిత్తం ఎమ్మిగనూరు నుండి ఆదోని వైపు బైక్ పై వెళ్తున్నారు. అయితే వారికి మార్గం మధ్యలో నడి రోడ్డుపై ఓ బ్యాగ్ కనిపించింది. అయితే, అందరిలా ఆ యువకులు కూడా చూసి చూడనట్టు వెళ్లకుండా, ఆ బ్యాగ్ ఎవరిదో పొరపాటున పడేసుకున్నారేమో అనే అనుమానంతో రోడ్ మీద ఉన్న ఆ బ్యాగ్ ను తీసుకున్నారు. ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూసిన యువకులు ఒక్కసారిగా అవక్కాయ్యారు. అందులో కట్టల కట్టల డబ్బులు, బంగారు, వెండి నగలు కనపడ్డాయి. దీంతో వెంటనే ఎమ్మిగనూరు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఆ బ్యాగ్‌ను అప్పగించి మానవత్వం చాటుకున్నారు ఆ ముగ్గురు యువకులు.

అయితే పోలీసులు ఆ బ్యాగ్ ఎవరిదో అని విచారించగా నందవరం మండల కేంద్రంలో నివాసం ఉంటున్నా ఓ RMP డాక్టర్ కుటుంబానికి చెందినదిగా గుర్తించారు. పోలీసులు బాధితులు సమాచారం ఇవ్వడంతో వారు స్టేషన్‌కు వచ్చారు. అయితే, RMP డాక్టర్ భార్య లలిత ఆదోనికు ఆటో లో వెళ్తున్న సమయంలో బ్యాగ్ మిస్ అయ్యిందని పోలీసుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసింది. బ్యాగ్ లో ఉన్న వస్తువులు 415 గ్రాముల గల విలువైన బంగారు ఆభరణాలు,120 గ్రాముల వెండి ఆభరణాలు, రెండు లక్షల యాభై వేలు నగదు ఉన్నట్టు బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఆ యువకులు తెచ్చి ఇచ్చిన బ్యాగ్‌ను పరిశీలించగా అందులో అన్ని వస్తువులు అలాగే ఉండటంతో బాధితులకు ఎస్‌ఐ శ్రీనివాసులు బ్యాగ్ ను అందజేశారు.

వీడియో చూడండి..

ఈ సమయంలో ఎంతో నిజాయితీతో బ్యాగ్‌ను అప్పగించిన సోహెల్, వలి, నరసింహులు ను పోలీస్‌లు అభినందించారు. బ్యాగులోని నగల విలువ బంగారు ఆభరణాలు, లక్షల రూపాయలు ఉన్న, ఎంతో నిజాయితీతో అప్పగించిన యువకులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తానికి మనుషుల్లో మానవత్వం ఇంకా బతికే ఉందని.. మనుషుల్లో చాలా మంది మంచోళ్లు ఉన్నారని ఈ ఘటన నిరూపితం చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి