Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అధిక ఫీజు వసూలు చేస్తే క్రిమినల్‌ కేసులు పెడతాం.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్

ప్రైవేటు ఆస్పత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ వస్తున్న ఫిర్యాదులతో ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆస్పత్రులు కనీస మానవత్వం కూడా మరిచి కోవిడ్ బాధితుల పట్ల..

అధిక ఫీజు వసూలు చేస్తే క్రిమినల్‌ కేసులు పెడతాం.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్
Ap Health Chief Secretary A
Follow us
Sanjay Kasula

|

Updated on: May 28, 2021 | 5:19 PM

ప్రైవేటు ఆస్పత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ వస్తున్న ఫిర్యాదులతో ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆస్పత్రులు కనీస మానవత్వం కూడా మరిచి కోవిడ్ బాధితుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే బాధితుల కుటుంబాల నుంచి భారీగా ఫిర్యాదులు అందడంతో ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుట్టింది. అయితే ఇప్పటికే తప్పు చేసిన ఆస్పత్రులకు నోటీసులు జారీచేయడం జరిగింది. అంతే కాకుండా జరిమానాలు విధిస్తూ వస్తోంది.

ఇకపై అలాంటి ఆస్పత్రులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బాధితుల నుంచి డబ్బులు అధికంగా వసూలు చేస్తే పది రెట్ల పెనాల్టీ వేస్తామని హెచ్చరించారు. రెండోసారి కూడా ఇదేవిధమైన తప్పిదాలకు పాల్పడితే క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ ప్రకారం క్రిమినల్‌ కేసులు పెడతామని ఉత్తర్వులో పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు, కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 50 లేదా అంతకంటే ఎక్కువ పడకలున్న ఆస్పత్రులు తప్పని సరిగా ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. 50 నుంచి 100 పడకలున్న ప్రైవేటు ఆస్పత్రులు 500 ఎల్‌పీఎమ్‌ కెపాసిటీ ఉన్న ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి: విరించి ఘటనపై విచారణకు ఆదేశించిన మంత్రి కేటీఆర్.. నిబంధలు ఉల్లంఘించిన ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని ఆదేశం

MEIL: తెలంగాణకు మేఘా చేయూత… బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న థాయిలాండ్‌ ఆక్సిజన్ ట్యాంకర్లు