AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: పేర్ని నాని గోడౌన్‌లో రేషన్ బియ్యం మిస్సింగ్ కేసు.. కూటమి సర్కార్ సీరియస్‌ యాక్షన్..

రేషన్ రైస్‌ మిస్సింగ్ వ్యవహారం ఏపీ రాజకీయాలను షేక్‌ చేస్తోంది. తాము తప్పు చేయలేదు కాబట్టే బియ్యం మాయంపై లేఖరాశామన్నారు పేర్నినాని. అడ్డంగా దొరికిపోయాక బుకాయించడం దేనికని ప్రశ్నిస్తోంది అధికారపార్టీ. పేదల బియ్యాన్ని బుక్కినవారినెవ్వరనీ వదిలే ప్రసక్తే లేదంటున్నారు మంత్రి నాదెండ్ల మనోహర్..

Andhra Pradesh: పేర్ని నాని గోడౌన్‌లో రేషన్ బియ్యం మిస్సింగ్ కేసు.. కూటమి సర్కార్ సీరియస్‌ యాక్షన్..
Perni Nani - Nadendla Manohar
Shaik Madar Saheb
|

Updated on: Dec 18, 2024 | 7:23 AM

Share

మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం మెడకు రేషన్ బియ్యం వివాదం చుట్టుకుంది. మచిలీపట్నం మండలం పొట్లపాలెంలో నాని సతీమణి పేరుతో ఉన్న గోడౌన్‌లో బియ్యం మిస్సింగ్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. పేర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్‌లో 187 టన్నుల రేషన్ బియ్యం మాయమయ్యాయి. అయితే, తమ గౌడౌన్‌లో మాయమైన బియ్యం ధర ఎంతో చెప్తామని కృష్ణాజిల్లా జేసీకి లేఖ రాయడం సంచలనంగా మారింది.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో గత నెల 28, 29 30 తేదీల్లో పౌర సరఫరాల శాఖ అధికారులు ఎంఎల్ఎస్ పాయింట్లలో తనిఖీలు చేపట్టగా 187 టన్నుల తేడా ఉన్నట్లుగా గుర్తించారు. కోటి డెబ్బై లక్షల రూపాయలు చెల్లించాలంటూ నోటీసులు పంపారు . దీంతో మాజీ మంత్రి పేర్ని నాని కోటి రూపాయల డీడీలు తీయించి ఈ నెల 14న జేసీ కార్యాలయంలో అందజేశారు. మరో 70 లక్షల రూపాయలను సోమవారం చెల్లించారు. మొత్తంగా రెండు విడతల్లో కలిపి రూ.1.7 కోట్ల డీడీలను అధికారులకు అందజేశారు.

ఈ వ్యవహారంలో గోడౌన్ ఓనర్ గా ఉన్న జయసుధ పై క్రిమినల్ కేసు నమోదు చేశారు పోలీసులు దీంతో పేర్ని సతీమణి జయసుధ, తనయుడు కృష్ణమూర్తి అజ్ఞాతంలోకి వెళ్లారు. మచిలీపట్నం జిల్లా కోర్టులో జయసుధ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీని విచారణను ధర్మాసనం తిరిగి 19కు వాయిదా వేసింది.

రెండు రోజులు తర్వాత పేర్నినాని అజ్ఞాతం వీడారు. సోమవారం తన ఇంటికి చేరుకోవడంతో వైసీపీ నేతలు ఆయనను పరామర్శించారు . బియ్యం లెక్కల్లో తేడాలు ఎందుకు వచ్చాయో తనకు తెలియదన్నారు పేర్ని నాని.. తాము తప్పు చేయలేదు కాబట్టే బియ్యం మాయంపై లేఖరాశామని పేర్నినాని చెప్పారు.

మరోవైపు పేర్ని జయసుధ పేరుతో రేషన్ నిల్వలు ఉన్న గోడౌన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని మార్కెటింగ్ గోడౌన్లకు తరలించారు. తర్వాత లెక్కలు చూసి తేడాలుంటే కేసులు పెడతామన్నారు అధికారులు.

పేర్నినాని కేసులో కక్ష సాధింపులేమీ లేదన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.. 4వేలకు పైగా బ్యాగులు మిస్ అయినట్టు గుర్తించామన్నారు. దర్యాప్తు తర్వాత చట్టప్రకారం పేర్ని నాని కుటుంబంపై చర్యలుంటాయన్నారు.

మరోవైపు తమ నేతలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందంటోంది వైసీపీ. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వేధింపులకు పాల్పడుతుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..