Andhrapradesh: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రతి గ్రామ పంచాయతీలో కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాలు.. సర్పంచ్‌లకు కీలక బాధ్యతలు
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి గ్రామ పంచాయతీలో కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పాఠశాలలు, వసతి గృహాలు...
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి గ్రామ పంచాయతీలో కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పాఠశాలలు, వసతి గృహాలు, ఇతర భవనాల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. కేంద్రాల గుర్తింపు పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతను అప్పగించింది. కేంద్రాల నిర్వహణ బాధ్యత సర్పంచులదే అని స్పష్టం చేసింది. కేసుల ఆధారంగా బెడ్ల ఏర్పాటు ఉండాలని… స్త్రీలకు, పురుషులకు వేర్వేరుగా ఐసోలేషన్ కేంద్రాలు ఉండాలని సూచించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
కరోనా పరిస్థితులపై సీఎం సమీక్ష
కోవిడ్–19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. బ్లాక్ ఫంగస్ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఇంజక్షన్లు తెప్పించుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టలన్నారు. వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్‌లపైనా సమాచారం వస్తోందని.. వాటిపైనా పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఆనందయ్య ఔషధంపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తోన్న నాటు మందుపై వీలైనంత త్వరగా పరిశీలన జరిపి నివేదిక అందించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. కంటిలో వేసే డ్రాప్స్‌పై వైద్య నిపుణులతో పరిశీలన చేయించాలన్నారు. ఆ ఫలితాలు వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అన్ని అంశాలపై సమగ్రంగా విచారణ జరిపి పూర్తిస్థాయి నివేదిక అందించాలని ఆదేశించారు.
Also Read: మరో సెన్సేషన్… కృష్ణపట్నం ఆనందయ్య నాటు మందుపై హైకోర్టులో పిటిషన్