AP Capital: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. 3 రాజధానుల బిల్లు ఉపసంహరణ.. అసలు ఏం జరిగిందంటే..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లు ఉపసంహారించుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తెలిపింది.

AP Capital: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. 3 రాజధానుల బిల్లు ఉపసంహరణ.. అసలు ఏం జరిగిందంటే..?
Ap Capital
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 22, 2021 | 3:57 PM

AP Three Capital: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లు ఉపసంహారించుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తెలిపింది. ఈ విషయాన్ని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. రాజధానుల అంశంపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఏజీ దాఖలు చేసిన అఫిడవిట్‌లో పొందుపర్చారు. బిల్లు ఉపసంహరణకు సంబంధించిన మెమో దాఖలు చేసేందుకు.. సమయం కావాలని ఏజీ కోరినట్టు న్యాయవాది జనార్ధన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం లోపు మెమో దాఖలు చేయాలని ఏజీని ఆదేశించింది కోర్టు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ఏపీ అసెంబ్లీ ముందుకు మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లు చర్చకు వచ్చింది. ఈ బిల్లును ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అసెంబ్లీలో ప్రవేశపెట‍్టగా.. బిల్లుపై చర్చకు ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అనుమతించారు. బాహుబలి తరహాలో రాజధాని కట్టాలని గత ప్రభుత్వం అబాసుపాలైందని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ విమర్శించారు. బిల్లుపై బుగ్గన మాట్లాడుతూ.. ‘కేంద్రం సంస్థలన్నీ హైదరాబాద్‌లో ఉన్నాయి ఒకే చోట సంస్థలన్నింటినీ ఏర్పాటు చేయడం వల్లే వేర్పాటు వాదం వచ్చింది. శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికపై చర్చే జరగలేదు’ అని తెలిపారు.  బాహుబలి తరహాలో రాజధాని కట్టాలని గత ప్రభుత్వం అబాసుపాలైందని విమర్శించారు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌. రాజధాని 7,500 చదరపు కిలోమీటర్లు పరిధిలో కట్టాలనుకున్నారని…ఆర్థిక రాజధాని ముంబై సిటీయే 4,300 చదరపు కిలోమీటర్లు ఉందని గుర్తు చేశారు. భవిష్యత్తు ఆర్థిక అంచనాలు లేకుండానే రాజధాని కట్టాలనుకున్నారని ఎద్దేవా చేశారు మంత్రి బుగ్గన. సీఆర్‌డీఏకు బదలాయించిన ఉద్యోగులను తిరిగి బదిలీ చేస్తున్నట్లు బుగ్గన రాజేందర్ స్పష్టం చేశారు. మరోవైపు మూడు రాజదానుల బిల్లు ఉపసంహరణపై అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తుళ్లూరు దీక్షా శిబిరంలో ఆనందం వ్యక్తం చేస్తూ.. మిఠాయిలు పంచుకున్నారు రైతులు, మహిళలు. తాజాగా మూడు రాజదానుల బిల్లు ఉపసంహరణపై అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తుళ్లూరు దీక్షా శిబిరంలో ఆనందం వ్యక్తం చేస్తూ.. మిఠాయిలు పంచుకున్నారు రైతులు, మహిళలు.

ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఉంటాయని 2019 డిసెంబర్ 17న సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయరాజధానిగా కర్నూలును నిర్ణయించినట్లు ప్రకటించారు. ఆ తర్వాత మండలిలో ప్రవేశపెట్టారు. అక్కడ ఆమోదం పొందకపోవడంతో గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చి పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏను రద్దు చేస్తూ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. దీనిపై రాజధాని రైతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఓ దశలో అమరావతి ప్రాంతం రణరంగంగా మారింది.

అప్పటి నుంచి రాజధానికి భూములిచ్చిన అమరావతి ప్రాంత రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ ఉద్యమం ఇప్పటికి 700 రోజులు దాటింది. ప్రస్తుతం రాజధాని రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో అమరావతి నుంచి తిరుపతికి మహాపాదయాత్ర చేపట్టారు. ప్రస్తుతం పాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. మరోవైపు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన 57 పిటిషన్లపై రోజువారీ విచారణకు చేపట్టింది. ఈ నేపథ్యంలో అడ్వకేట్ జనరల్ మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు.

రెండున్నరేళ్లుగా మూడు రాజధానులపై భీష్మించుకొని కూర్చున్న సీఎం వైఎస్ జగన్ ఎట్టకేలకు బిల్లును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, కేబినెట్ సమావేశం ప్రారంభమయ్యేవరకు మంత్రులకు కూడా ఈ విషయం తెలియనట్లు సమాచారం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతు చట్టాలను వెనక్కి తీసుకున్న కొద్దిరోజులకే ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాష్ట్ర బీజేపీ నేతలు అమరావతి రైతుల మహాపాదయాత్రలో పాల్గొని మద్దతు తెలిపిన తర్వాతి రోజే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది.

Read Also… CM Jagan: రాజధాని అంశంపై అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన…