Sangam Dairy: ప్రభుత్వ పరిధిలోకి గుంటూరు సంగం డెయిరీ… కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ రాష్ట్ర సర్కార్
గుంటూరు జిల్లా సంగం డెయిరీ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డెయిరీ యాజమాన్యపు హక్కులు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Guntur Sangam dairy: గుంటూరు జిల్లా సంగం డెయిరీ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డెయిరీ యాజమాన్యపు హక్కులు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లా పాల ఉత్పత్తి దారుల సహకార సంఘానికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. సంగం డెయిరీ యాజమాన్య హక్కులు మారుస్తూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసంది. సంగం డెయిరీ రోజువారీ కార్యకలాపాల బాధ్యతను తెనాలి సబ్ కలెక్టర్‌కు అప్పగించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు తెనాలి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ డెయిరీకి చేరుకున్నారు.. అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. డెయిరీ రోజువారీ కార్యకలాపాలు ఇబ్బంది కలగకూడదని ఉద్దేశంతోనే జీవో విడుదల చేశామని ప్రభుత్వం చెబుతోంది.
ఇదిలావుంటే, సంగం డెయిరీలో అవకతవకలు జరిగాయంటూ ఏసీబీ అధికారులు ఛైర్మన్, టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన్ను కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. అలాగే, ఐదు రోజులుగా సంగం డెయిరీలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మరోవైపు, ఇప్పటికే డెయిరీ వ్యవహారాలపై మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పైనా విచారణ కొనసాగుతోంది.
Read Also… ప్రీమియం కట్టడం ఒక్కసారి మాత్రమే..! బ్యాంకు వడ్డీ కంటే డబుల్ ప్రాఫిట్..? ఎల్ఐసీ సూపర్ పాలసీ..