Bakrid 2021: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. బక్రీద్‌ పండుగ నిర్వహణపై ఆంక్షలు..

Eid ul Adha 2021: కరోనావైరస్‌ వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. థర్డ్‌ వేవ్‌ మొదలయ్యే అవకాశం ఉండటంతో పలు రాష్ట్రాలు పండుగలు, వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌

Bakrid 2021: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. బక్రీద్‌ పండుగ నిర్వహణపై ఆంక్షలు..
Bakrid 2021
Follow us

|

Updated on: Jul 16, 2021 | 5:04 PM

Eid ul Adha 2021: కరోనావైరస్‌ వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. థర్డ్‌ వేవ్‌ మొదలయ్యే అవకాశం ఉండటంతో పలు రాష్ట్రాలు పండుగలు, వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో కోవిడ్ కర్ఫ్యూ కొనసాగుతున్న నేపథ్యంలో బక్రీద్ పండుగ నిర్వహణపై ఆంక్షలు విధించింది. ఈద్గాలు, బహిరంగ ప్రదేశాల్లో ప్రార్ధనలు నిషేధిస్తున్నట్టు రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి అంజాద్ బాషా ప్రకటించారుఉ. భారీ జన సమూహాలను నివారించేందుకు మసీదుల్లో మాత్రమే ప్రార్ధనలకు అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. భౌతిక దూరం పాటిస్తూ.. మసీదుల్లో 50 శాతం మందికి మాత్రమే ప్రార్ధనలకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంత్రి అంజాద్‌ బాషా శుక్రవారం ప్రకటనను విడుదల చేశారు. కరోనా తీవ్రత దృష్ట్యా ప్రజలు జాగ్రత్త వహించాలని, సాధ్యమైనంత వరకూ ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని ప్రకటనలో తెలిపారు.

మాస్కులు లేకుండా మసీదుల్లోకి అనుమతించవద్దని ఆయా కమిటీలకు ఆదేశాలు జారీ చేశారు. మసీదు ప్రాంగణాల్లో శానిటైజర్లు, సబ్బులు అందుబాటులో ఉంచాల్సిందిగా ఆదేశించారు. వృద్ధులు, పిల్లలు ఇంటి వద్ద ప్రార్ధనలు చేసుకోవాల్సిందిగా సూచించారు. ఈద్ మిలాప్ , ముసాఫా, ఆప్తులను కౌగిలించుకోవటం లాంటివి చేయొద్దంటూ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది ప్రభుత్వం. మాంసం విక్రయ కేంద్రాల్లోనూ కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా చూడాలని ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

Also Read:

Viral Video: గోడ నుంచి వింత శబ్దాలు.. తీరా చూసి ఖంగుతిన్న అధికారులు.!

Pragya Singh Thakur: డ్యాన్స్‌ చేస్తారు.. కానీ ఆసుపత్రికి వెళ్లలేరా?.. ప్రగ్యా ఠాకూర్‌పై విమర్శల వెల్లువ

Latest Articles