Realter Murder Case: మరో మహిళతో తండ్రి సంబంధం, ఆస్తిని నాశనం చేస్తున్నారని హతమార్చిన కొడుకు!

Balaraju Goud

Balaraju Goud |

Updated on: Jul 16, 2021 | 5:32 PM

ఆస్తి కోసం ఓ వ్యక్తి జన్మనిచ్చిన కన్న తండ్రినే అతి దారుణంగా హత్య చేశాడు. ఎట్టకేలకు పోలీసుల దర్యాప్తుతో ఆయన గారి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Realter Murder Case: మరో మహిళతో తండ్రి సంబంధం, ఆస్తిని నాశనం చేస్తున్నారని హతమార్చిన కొడుకు!
Arrested

Guntur police chased Murder case: ఆస్తి కోసం ఓ వ్యక్తి జన్మనిచ్చిన కన్న తండ్రినే అతి దారుణంగా హత్య చేశాడు. ఎట్టకేలకు పోలీసుల దర్యాప్తుతో ఆయన గారి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘాతుకానికి పాల్పడ్డ కొడుకుతో పాటు అతనికి సహకరించిన మరో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

ఈనెల7న హత్యకు గురైన రియల్టర్ వెంగమాంబ మల్లికార్జున రావు హత్య కేసును గుంటూరు గ్రామీణ పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడ్డ ఏడుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కత్తులు, ఐరన్ రాడ్లు, ఆటో, బైక్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు గుంటూరు గ్రామీణ అదనపు ఎస్పీ మూర్తి తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నరసరావుపేట రామిరెడ్డి పేటకు చెందిన వెంగమాంబ మల్లికార్జున రావు ఈనెల 7న రావిపాడు వద్ద హత్యకు గురయ్యాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానం తో కేసును లోతుగా పరిశీలించి ఛేదించామని ఎస్పీ మూర్తి తెలిపారు. ఈ హత్యకు అస్థి తగాదాలతో పాటు అక్రమ సంబంధం కారణమని తెలిపారు. స్వయాన మృతుడు కుమారుడు సాయికృష్ణయే హత్యకు పథకం రూపొందించాడని ఎస్పీ మూర్తి వివరించారు. తన తండ్రి మల్లిఖార్జున రావు మరో మహిళతో సంబంధం పెట్టుకుని ఆస్తిని నాశనం చేస్తున్నారని అక్కసుతో హత్య చేయించాడని తెలిపారు.

మల్లికార్జున రావు కుమారుడు సాయికృష్ణ ఇందు కోసం పక్కా ప్రణాళికు రచించాడు. ఇందుకోసం రాజారెడ్డి అనే వ్యక్తికి రూ. 20 లక్షలు సుఫారీ ఇచ్చి హత్య చేయించాడు. రాజారెడ్డి తన అనుచరులతో కలసి ఈనెల 7 న పథకం ప్రకారం హత్య చేసి, మృతదేహన్ని మాయం చేసేందుకు యత్నించాడు. పోలీసుల ఎంట్రీతో సీన్ మొత్తం రివర్స్ అయిన కొడుకు, సుఫారీ గ్యాంగ్‌తో సహా కటకటాలపాలయ్యారు. కాగా, ఘటనలో మొత్తం 9 మంది పాల్గొన్నట్లు ఎస్పీ మూర్తి తెలిపారు. సాయికృష్ణ, రాజారెడ్డితో పాటు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశామని, మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టామన్నారు. త్వరలోనే వారిని కూడా పట్టుకుంటామన్నారు. ఈ కేసులో చురుకుగా వ్యవహారించని పోలీసులను ఎస్పీ మూర్తి అభినందించారు.

Read Also… Viral Video: ఈ విమానం నీళ్లలో ల్యాండ్ అవుతుందా ఏంటీ?.. వీడియో చూస్తే మీరూ షాక్ అవుతారు..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu