Ap Government: విద్యుత్ సంస్కరణలపై ఏపీ సర్కార్ తొలి విజయం.. కరెంట్ బిల్లు నిర్ణయించే అధికారం రాష్ట్రాలదే..!
విద్యుత్ సంస్కరణలపై ఏపీ సర్కార్ తొలి విజయం సాధించింది. కరెంట్ బిల్లు నిర్ణయించే అధికారాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలికి దక్కింది.
Ap Government: విద్యుత్ సంస్కరణలపై ఏపీ సర్కార్ తొలి విజయం సాధించింది. కరెంట్ బిల్లు నిర్ణయించే అధికారాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలికి దక్కింది. ఈ విషయంలో ఒక మెట్టు దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ముసాయిదాలో మార్పులు, చేర్పులు చేసేందుకు కూడా సిద్దమైంది. ప్రజలకు ఇబ్బందులు కలిగించే కేంద్ర విద్యుత్ సంస్కరణలపై.. ఏపీ సర్కార్ చేసిన ఒత్తిడి ఫలించింది. కరెంట్ బిల్లు నిర్ణయించే అధికారం రాష్ట్రాలకే ఉండాలంటూ ఏపీ ప్రభుత్వం చేసిన విన్నపానికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. కరెంట్ బిల్లు నిర్ణయించే అధికాారాన్ని తమ గుప్పెట్లోకి తీసుకోవాలన్న ఆలోచనను కేంద్రం తాజాగా విరమించుకుంది. ఏపీ విద్యుత్ నియంత్రణ మండలిని కొనసాగించేందుకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముసాయిదాలో మార్పులు, చేర్పులపై నేడు కేంద్ర ఇందన శాఖ ఉన్నతాధికారులు.. అన్ని రాష్ట్రాల అధికారులతో నేడు చర్చించనున్నారు.
అసలు ఏమైందంటే…
కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా చట్ట సవరణకు ముసాయిదా ప్రతిని గత ఏడాది రాష్ట్రాలకు పంపింది. దీనిపై ఏపీ ప్రభుత్వం ఘాటుగానే స్పందించింది. రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా విద్యుత్ ధరలు నిర్ణయించే అధికారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికే ఉంటుంది. దీన్ని జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలనేది సంస్కరణల్లో ఒక అంశం. దీని వల్ల రాష్ట్ర ప్రజలపై భారం పడే అవకాశం ఉందని.. జగన్ సర్కార్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. ఏపీ స్పూర్తితో ఇతర రాష్ట్రాలు కూడా కేంద్రంపై ఒత్తిడి పెంచడంతో.. కేంద్రం ఒక మెట్టు దిగొచ్చింది.
Also Read: