YSRCP Colors: చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకు పార్టీ రంగులు తొలగిస్తున్నామని ఏపీ సర్కారు ప్రమాణపత్రం
రాష్ట్ర వ్యాప్తంగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకు పార్టీ రంగులు తొలగిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇవాళ
Andhra Pradesh Government: రాష్ట్ర వ్యాప్తంగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకు పార్టీ రంగులు తొలగిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇవాళ ప్రమాణ పత్రం దాఖలు చేసింది జగన్ ప్రభుత్వం. భవిష్యత్తులో ఏ ప్రభుత్వ భవనానికి కూడా పార్టీ రంగులు వేయమంటూ హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేశారు పంచాయతీ రాజ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది.
రాష్ట్రవ్యాప్తంగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకు పార్టీ రంగులు వేస్తున్నారు అంటూ జై భీమ్ జస్టిస్ కృష్ణా జిల్లా అధ్యక్షులు పరశా సురేష్ కుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. పిటిషనర్ తరఫున ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు.
దీనిపై విచారించిన ఏపీ హైకోర్టు.. తక్షణమే పార్టీ రంగులు తొలగించి ప్రమాణపత్రం దాఖలు చేయాలని గత నెలలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను అనుసరించి ఈరోజు హైకోర్టులో జగన్ ప్రభుత్వం ప్రమాణ పత్రం దాఖలు చేసింది.
Read also: Sajjala: రాంగోపాల్ వర‍్మకు చెప్పండి.. చంద్రబాబు, లోకేష్‌లకు సజ్జల రామకృష్ణారెడ్డి సలహా