Sajjala on Sharmila: కాంగ్రెస్‌లో షర్మిల చేరిక వెనుక చంద్రబాబు కుట్ర.. సజ్జల సంచలన వ్యాఖ్యలు..

కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల నిర్ణయంపై.. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డిని అక్రమ కేసులు పెట్టి వేధించారో ఆ పార్టీతోనే షర్మిల కలిశారని సజ్జల ఆరోపించారు. వైఎస్సార్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఇబ్బందులు పెట్టిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు.

Sajjala on Sharmila: కాంగ్రెస్‌లో షర్మిల చేరిక వెనుక చంద్రబాబు కుట్ర.. సజ్జల సంచలన వ్యాఖ్యలు..
Sharmila Sajjala Ranakrishna Reddy
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 06, 2024 | 4:48 PM

కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల నిర్ణయంపై.. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డిని అక్రమ కేసులు పెట్టి వేధించారో ఆ పార్టీతోనే షర్మిల కలిశారని సజ్జల ఆరోపించారు. వైఎస్సార్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఇబ్బందులు పెట్టిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. అయితే.. షర్మిల ఓ పార్టీకి అధ్యక్షురాలని, ఆమె నిర్ణయాలు ఆమె ఇష్టమన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే పనిలో పనిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ లో వైఎస్ షర్మిల చేరిక వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపించారు. ప్రజలా? కుటుంబమా అన్న ప్రశ్న వస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ ఱెడ్డి ఛాయిస్ ప్రజలేనని స్పష్టం చేశారు సజ్జల. రాజకీయాల్లో కుటుంబానికి ప్రాధాన్యత ఉండకూడదు అంటూనే మళ్ళీ ఈ వాదన ఎందుకు తెస్తున్నారు? అని ప్రశ్నించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరులు వైఎస్ వివేకానందా రెడ్డి తమకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నుంచి పోటీ చేశారని గుర్తు చేశారు. ఫలితం ఏమయ్యిందో అందరికీ తెలుసన్నారు సజ్జల.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబం కోసం పార్టీ పెట్టలేదన్న సజ్జల.. మా విధానాలు మాకు ఉన్నాయన్నారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా వైఎస్ జగన్ జనం ఎరిగిన నేతగా దూసుకుపోతున్నారన్నారు. ఎంత మంది వచ్చిన వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ క్లీన్‌స్విప్ చేయడం ఖాయమన్నారు. అలాగే పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలపై సజ్జల స్పందించారు. పార్టీ వీడటానికి కారణం వాళ్ళే చెప్పారు. ఎఫెక్ట్ అయిన తర్వాత వాళ్ళ అభిప్రాయం వాళ్ళకు ఉంటుందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సాధ్యమైనంత ఎక్కువగా గెలుపు గుర్రాలను ఎంపిక చేసే ప్రయత్నం చేస్తామన్నారు. ప్రతి ఎన్నికల్లో టికెట్ ఇవ్వటమే కిరీటం కాదన్న సజ్జల, నియోజకవర్గాల్లో మార్పులు ఏ పార్టీలో అయినా అంతర్గతంగా జరిగాల్సిన కసరత్తు అని స్పష్టం చేశారు. నచ్చ చెప్పే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. పార్టీ ఇన్‌చార్జీలు, ఎమ్మెల్యేల మార్పులు చేసిన చోట స్పందన బాగుందని సజ్జల తెలిపారు.

ఇక అంగన్వాడీల నిరావధిక సమ్మెపై సజ్జల స్పందించారు. అంగన్వాడీ సిబ్బంది సమ్మె మొదలు పెట్టి నెలరోజులైందని, నచ్చచెబుతున్నా వినకపోవడంతో ఎస్మా ప్రయోగించామన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. బాలింతలు, పసిపిల్లలు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని ఆయన ప్రశ్నించారు. తాము సంయమనంతో ఉన్నామని, ఒకటి రెండు డిమాండ్లపై అంగన్వాడీలు పట్టుబడుతున్నారని చెప్పారు సజ్జల. ఈ విషయంలో టీడీపీ నేతల విమర్శలను తప్పుబట్టారు సజ్జల.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…