Kesineni Nani vs Chinni: ‘చంద్రబాబును తప్పుబట్టడానికి లేదు’.. బెజవాడలో గరం గరం పాలిటిక్స్.. చర్చలు ఫలించేనా..?
వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్ లేదనే హైకమాండ్ మాటను కూడా నాని చెవిలో వేసేశారు. అంతేకాదు.. ఏడో తేదీ తిరువూరులో జరగనున్న చంద్రబాబు సభా బాధ్యతలు కేశినేని చిన్నికి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని కూడా అధిష్టానం పెద్దలు నానికి సూచించారు. అయితే, టీడీపీకి కేశినేని నాని రాజీనామా ప్రకటన తర్వాత కనకమేడల రవీంద్ర కుమార్ కూడా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

బెజవాడ టీడీపీ పాలిటిక్స్ ఇంట్రస్టింగ్‌గా మారాయి. తిరువూరు ఘటనతో ఎంపీ కేశినాని, చిన్ని మధ్య ఫైట్ పీక్స్‌కి చేరడంతో..ఏకంగా అధిష్ఠానం రంగంలోకి దిగి వివాదాన్ని సద్దుమణిగే ప్రయత్నం చేస్తోంది.. టీడీపీ సీనియర్ నేతలు వరుసగా భేటీ అవుతున్నారు. నెట్టెం రఘురాం, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ మంత్రి ఆలపాటి రాజాలు.. కేశినేని నానిని కలిసి అధిష్ఠానం ఆదేశాలను పాటించాలని సూచించింది. వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్ లేదనే హైకమాండ్ మాటను కూడా నాని చెవిలో వేసేశారు. అంతేకాదు.. ఏడో తేదీ తిరువూరులో జరగనున్న చంద్రబాబు సభా బాధ్యతలు కేశినేని చిన్నికి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని కూడా అధిష్టానం పెద్దలు నానికి సూచించారు. అయితే, టీడీపీకి కేశినేని నాని రాజీనామా ప్రకటన తర్వాత కనకమేడల రవీంద్ర కుమార్ కూడా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు అధిష్ఠానం ఆదేశాలను శిరసావహిస్తానని చెప్పిన నాని.. ఎంపీ సీటు విషయంలో మాత్రం కాస్తా అసంతృప్తికి గురయ్యారు. నిన్న ముఖ్య నేతలు, కార్యకర్తలు, అనుచరులతో సమావేశమైన నాని పార్టీ అధినేత చంద్రబాబును బాబును హిట్లర్‌తో పోల్చారు. చంద్రబాబుకు తాను వెన్నుపోటు పొడవలేదని..పొడిస్తే ఇంకా మంచి పదవిలో ఉండేవాడినంటూ కామెంట్ చేశారు కేశినేని నాని. విజయవాడ ప్రజల మీద తనకు నమ్మకం ఉందన్న నాని.. ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా గెలుస్తానని గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. తానేం చేయాలో కాలమే నిర్ణయిస్తుందన్నారు.
బెజవాడలో రెండు మూడురోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే…అస్సలు కేశినేని స్ట్రాటజీ ఏంటో ఎవరికి అర్థం కావడం లేదు. మొదట ఎంపీ పదవికి, తర్వాత పార్టీకి రాజీనామా చేస్తానని నాని చెప్పారు. రెండేళ్ల క్రితమే రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుని తాను భావించినట్లు వివరించారు. అయితే చంద్రబాబు నిర్ణయాన్ని తాను తప్పుపట్టనని కేశినేని చెబుతున్నారు. అదే సందర్భంలో చంద్రబాబు పొమ్మన్న తర్వాత పార్టీలో ఉండడం సరికాదని కేశినేని నాని వ్యాఖ్యానించారు. కార్యకర్తలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటానని కేశినేని నాని వివరించారు.
ఎంపీగా కేశినేని నానిని సభకు పిలుస్తాం.. కేశినేని చిన్ని
ఓ వైపు టీడీపీలో కేశినేని నాని రచ్చ సాగుతుంటే.. మరోవైపు రేపు తిరువూరులో జరిగే సభకు 2 లక్షల మందిని సమీకరించేలా ఏర్పాట్లు చేస్తోంది ఆ పార్టీ. ప్రొటోకాల్ ప్రకారం ఎంపీగా కేశినేని నానిని సభకు తప్పకుండా పిలుస్తామని కేశినేని చిన్ని పేర్కొన్నారు. నాని తిరువూరు సభకు వస్తారని ఆశిస్తున్నామని.. తామంతా కలిసికట్టుగా పనిచేస్తాంటూ చిన్ని పేర్కొన్నారు.
ఇదిలాఉంటే.. నిన్న చంద్రబాబును హిట్లర్‌తో పోల్చిన కేశినేని నాని.. ఇవాళ చంద్రబాబును తప్పుబట్టడానికి లేదని వ్యాఖ్యానించారు. అధికారం రావాలంటే ఎన్నో స్ట్రాటజీలు ఉంటాయన్నారు. తిరువూరు సభకు రావొద్దన్నారు..అందుకే వెళ్లడం లేదంటూ వ్యాఖ్యానించారు.
మొత్తానికి తిరువూరు సభ తర్వాత ఏం జరగబోతోంది..? సభ సక్సెస్ అయితే…నాని ప్లేస్‌లో చిన్ని ఉంటారా..? టీడీపీ అధిష్ఠానం నానిని కాదని టిక్కెట్ చిన్నికి ఇస్తుందా..? తాజా పరిణామాలు చూస్తుంటే బెజవాడ టిక్కెట్ ఈసారి చిన్నికే కన్ఫామ్ అయినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారట. ఇదే జరిగితే..మరి నాని ఏం చేయబోతున్నారు..? చూడాలి మరి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




