AP Eamcet 2023 Result Date: జూన్ 14న ఈఏపీసెట్-2023 పరీక్ష ఫలితాలు.. అధికారిక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్-2023 పరీక్ష ఫలితాలు జూన్ 14న విడుదలకానున్నాయి. బుధవారం (జూన్ 14)న ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఫలితాలను జేఎన్‌టీయూ అనంతపూర్ విడుదల చేయనున్నట్లు ఈ మేరకు విద్యాశాఖ మంత్రి..
ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్-2023 పరీక్ష ఫలితాలు జూన్ 14న విడుదలకానున్నాయి. బుధవారం (జూన్ 14)న ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఫలితాలను జేఎన్‌టీయూ అనంతపూర్ విడుదల చేయనున్నట్లు ఈ మేరకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం విజయవాడలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. ఫలితాల ప్రకటన అనంతరం అధికారిక వెబ్‌సైట్‌తోపాటు, టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌లలో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.
కాగా ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు మే 15 నుంచి 19 వరకు జరిగాయి. అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు 22, 23 తేదీల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈఏపీసెట్ పరీక్షలకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ విభాగంలో 2,24,724 మంది, ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగాల్లో 90,573 మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ ‘కీ’లు మే 24న విడుదలయ్యాయి. ప్రాథమిక ఆన్సర్ కీపై మే 26 ఉదయం 9 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరించింది. ఫలితాలతోపాటు, తుది ఆన్సర్ కీ కూడా విడుదల చేస్తారు. ఈఏపీసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో కౌన్సెలింగ్ ద్వారా సీటు కేటాయింపులు ఉంటాయి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.