AP Corona Cases: గుడ్ న్యూస్.. ఏపీలో భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు.. కొత్తగా ఎన్నంటే.!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2620 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో...

AP Corona Cases: గుడ్ న్యూస్.. ఏపీలో భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు.. కొత్తగా ఎన్నంటే.!
Coronavirus Cases In AP
Follow us

|

Updated on: Jun 21, 2021 | 5:24 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2620 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 18,53,183కి చేరింది. ఇందులో 58,140 యాక్టివ్ కేసులు ఉండగా.. 17,82,680 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా రాష్ట్రంలో 44 మంది ప్రాణాలు విడిచారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 12,363కు చేరుకుంది. ఇక గడిచిన 24 గంటల్లో 7504 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 2,12,05,849 సాంపిల్స్‌ను పరీక్షించారు.

నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 128, చిత్తూరు 531, తూర్పుగోదావరి 335, గుంటూరు 158, కడప 162, కృష్ణా 213, కర్నూలు 162, నెల్లూరు 201, ప్రకాశం 127, శ్రీకాకుళం 144, విశాఖపట్నం 160, విజయనగరం 88, పశ్చిమ గోదావరి 211 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

Also Read:

వన్డే క్రికెట్‌లో ప్రపంచ రికార్డు.. రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు.. ఓవరాల్‌గా 481 పరుగులు..

ఈ ఫోటోలో పులి దాగుంది.! మీరు కనిపెట్టగలరా.? చాలామంది ఫెయిల్ అయ్యారు.!

నది దాటుతున్న సింహంపై మొసలి సాలిడ్ ఎటాక్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!