కాగా, బాధితురాలికి తక్షణ సహాయంగా రూ. 5 లక్షల నష్టపరిహారాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించినట్లు మంత్రి సుచరిత తెలిపారు. కాగా, మహిళా శిశు సంక్షేమ శాఖ తరఫున బాధితురాలికి రూ. 50 వేల తక్షణ సహాయాన్ని మంత్రి తానేటి వనిత అందించారు. ఇదిలాఉంటే.. ఈ ఘటనకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను హోంమంత్రి సుచరిత ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరం పుష్కర ఘాట్ వద్ద నదీ తీరంలో సేదతీరుతున్న ప్రేమజంటపై దుండగులు దాడి చేసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. తన కాళ్ళు, చేతులు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది. అనంతరం నిందితులు పడవలో విజయవాడ వైపు వెళ్లిపోయారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. శనివారం నాడు చోటు చేసుకున్న ఈ దారుణం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనను పోలీస్ యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. ఈ దురాఘతానికి పాల్పడింది గంజాయి, బ్లేడ్ బ్యాచ్ అని పోలీసులు అంచనాకు వచ్చారు. వారిలో ఒకరిని గుర్తించి ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరొకరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
Home Minister Media Byte:
Also read: