Railway Insurance : రైల్వే ప్రయాణికులకు గమనిక..! 49 పైసలకే 10 లక్షల రైల్వే ఇన్సూరెన్స్.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

Railway Insurance : రైలులో ప్రయాణించేటప్పుడు ప్రమాదాలు లేదా వస్తువుల దొంగతనం జరిగే అవకాశం ఉంటుంది.

Railway Insurance : రైల్వే ప్రయాణికులకు గమనిక..! 49 పైసలకే 10 లక్షల రైల్వే ఇన్సూరెన్స్.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
Railway Passengers
Follow us

|

Updated on: Jun 21, 2021 | 4:55 PM

Railway Insurance : రైలులో ప్రయాణించేటప్పుడు ప్రమాదాలు లేదా వస్తువుల దొంగతనం జరిగే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీకు బీమా చాలా అవసరం. రైలు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మీరు కేవలం 49 పైసలకు 10 లక్షల రూపాయల ప్రయాణ బీమా పొందవచ్చు. దాని కోసం ప్రీమియం కూడా చెల్లిస్తారు కానీ అలాంటి పరిస్థితిలో క్లెయిమ్ ఎలా చేసుకోవాలో తెలియదు. ఐఆర్‌సిటిసి ద్వారా రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే వినియోగదారులందరికీ ఈ సౌకర్యం తప్పనిసరి. సెప్టెంబర్ 2018 నుంచి దీనికి కనీస ఛార్జీ వసూలు చేస్తున్నారు. టికెట్ బుక్ చేసే సమయంలో కస్టమర్లు దీనిని ఎంచుకునే అవకాశం ఉంటుంది. బీమా ప్రీమియం మొత్తం 50 పైసల కన్నా తక్కువ కనుక టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరూ ఈ ఎంపికను ఎంచుకోవడం మంచిది.

రైలు ప్రయాణ బీమా ఏమిటి? రైలు ప్రయాణ బీమా కింద, మరణం లేదా తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు రూ.10 లక్షలు లభిస్తాయి. రైలు ప్రమాదం సమయంలో ఈ బీమా చాలా ఉపయోగపడుతుంది. శాశ్వత పాక్షిక వైకల్యం విషయంలో బీమా కవరేజ్ రూ.7.5 లక్షల వరకు ఉంటుంది. ఆ సమయంలో ఆసుపత్రిలో చేరడానికి మరియు చికిత్స కోసం రూ .2 లక్షల వరకు లభిస్తుంది. ఈ మొత్తం మరణం, వైకల్యం కవరేజ్ కంటే ఎక్కువ. రైలు ప్రమాదం, దొంగతనం, అలాంటి ఏదైనా పరిస్థితికి ఈ బీమా కింద కవరేజ్ లభిస్తుంది. ఐఆర్‌సిటిసి అందించే ఈ బీమా పథకానికి ప్రయాణికులందరూ అర్హులు. వారు ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుని ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎంచుకుంటారు. రైలు టిక్కెట్లు కొనేటప్పుడు మాత్రమే ప్రయాణికులు ఈ సదుపాయాన్ని ఎంచుకోవాలి. ఈ సౌకర్యం భారతీయ పౌరులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఒక విదేశీ పౌరుడు భారతీయ రైల్వేలో ప్రయాణిస్తే వారికి ప్రయాణ బీమా సౌకర్యం లభించదు.

దావా దాఖలు ప్రక్రియ ఏమిటి? 1. ఇందుకోసం ఐఆర్‌సిటిసి మూడు బీమా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మూడు కంపెనీలు భారతీయ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్, బజాజ్ అల్లియన్స్ జనరల్ ఇన్సూరెన్స్, శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఐసిఐసిఐ లోంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. 2. మీరు ఈ మూడు కంపెనీలలో ఏదో ఒక దానిలో బీమాను కొనుగోలు చేస్తున్నారని గుర్తుంచుకోవాలి. ఇది మీకు ఐఆర్‌సిటిసి ద్వారా అందించబడుతోంది. 3. టికెట్ బుక్ చేసే సమయంలో బీమాను కొనుగోలు చేసిన తరువాత పాలసీ పత్రం మీకు ఇమెయిల్ ద్వారా పంపబడుతుంది. 4. మీరు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే సంబంధిత సంస్థ నామినేషన్ వివరాలను నింపాలి. మీరు దీన్ని చేయకపోతే అవసరమైతే దాని పరిష్కారం చట్టపరమైన వారసుడికి జరుగుతుంది.

Anchor Pradeep: ఏపీ రాజ‌ధానిపై స్పందించిన ప్ర‌దీప్‌.. ఎవ‌రినైనా ఇబ్బంది పెడితే క్ష‌మించండి అంటూ..

Meet SpaceBok: మార్స్‌పైకి నాలుగు కాళ్ల రోబో.. అసలు ఇది ఏం చేస్తుందో తెలుసా.?

WTC Final 2021: భారత పేసర్లపై నెటిజన్ల సెటైర్లు..! భువీ లేకపోవడమే లోటంటూ కామెంట్లు