AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Congress: ఏపీ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా రిలీజ్.. కడప లోక్ సభ బరిలో షర్మిల!

కడప కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు. అంతేకాక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏఏ స్థానాల నుంచి పోటీ చేస్తుంది అనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు 114 మంది అసెంబ్లీ నియోజకవర్గ జాబితాను అలానే ఐదు పార్లమెంటరీ అభ్యర్థుల జాబితాను షర్మిల విడుదల చేశారు.

AP Congress: ఏపీ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా రిలీజ్.. కడప లోక్ సభ బరిలో షర్మిల!
Ap Congress
Sudhir Chappidi
| Edited By: Balu Jajala|

Updated on: Apr 02, 2024 | 5:31 PM

Share

కడప కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు. అంతేకాక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏఏ స్థానాల నుంచి పోటీ చేస్తుంది అనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు 114 మంది అసెంబ్లీ నియోజకవర్గ జాబితాను అలానే ఐదు పార్లమెంటరీ అభ్యర్థుల జాబితాను షర్మిల విడుదల చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థుల జాబితాను ప్రకటించామని ముఖ్యంగా కడప ఎంపీ అభ్యర్థిగా తాను ఎందుకు పోటీ చేస్తున్నాను షర్మిల స్పష్టంగా తెలియజేశారు

నిన్నటి వరకు షర్మిల పోటీపై కొంత స్పష్టత లేనప్పటికీ ఈరోజు షర్మిల పోటీపై క్లారిటీ వచ్చింది తాను కడప ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నానని పోటీ చేయడానికి కూడా బలమైన కారణమే ఉందని షర్మిల స్పష్టం చేసింది. అవినాష్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇచ్చినందుకే తాను ఎన్నికల బరిలో దిగుతున్నానని హత్యా రాజకీయాలకు పాల్పడే వ్యక్తికి జగనన్న మళ్లీ సీటు కేటాయించడంపై నేను సహించలేకపోతున్నానని అందుకే కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని షర్మిల అన్నారు.

దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి చివరి కోరిక నేను ఎంపీగా పోటీ చేయడమేనని ఆరోజు వివేకానంద రెడ్డి చిన్నాన్న నన్ను ఎందుకు అంత గట్టిగా ఫోర్స్ చేశారు ఇప్పుడు అర్థమైందని, అందుకే ఆయన చివరి కోరిక నెరవేర్చడం కోసమే నేను కడప ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నానని షర్మిల అన్నారు. మా కుటుంబంలో చీలికలు వస్తాయని తెలిసిన తప్పనిసరి పరిస్థితుల్లో చీలికలు వచ్చిన పోటీకి సిద్ధపడ్డానని ఆ చీలికల పర్యవసానం ఎలా ఉంటుందో ఎన్నికలే తేల్చాలని కూడా షర్మిల అన్నారు. మొత్తం మీద నిన్న మొన్నటి వరకు షర్మిల పోటీపై ఉన్న సస్పెన్స్ అంతా తీరిపోయిందని ఇక వైఎస్ వర్సెస్ ఉంటుందని స్థానిక ప్రజానికం లో కొత్త చర్చ మొదలైంది వైయస్సార్సీపి టిడిపి మధ్య పోటీ కాస్త ఇప్పుడు వైసీపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారిపోయింది.

ఏపీ కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

-కడప లోక్‌సభ బరిలో వైఎస్‌ షర్మిల -రాజమండ్రి (ఎంపీ)-గిడుగు రుద్రరాజు -కాకినాడ (ఎంపీ)-పల్లంరాజు -బాపట్ల (ఎంపీ)-జేడీ శీలం -కర్నూలు (ఎంపీ)-రాంపుల్లయ్య యాదవ్‌ శింగనమల (అసెంబ్లీ)- శైలజానాథ్‌ చింతలపూడి (అసెంబ్లీ)-ఎలిజా నందికొట్కూరు (అసెంబ్లీ)-ఆర్థర్‌

కడప లోక్‌సభ అభ్యర్థులు అవినాష్‌ రెడ్డి (వైసీపీ) VS షర్మిల ( కాంగ్రెస్ ) VS భూపేష్ రెడ్డి (టీడీపీ)