YS Jagan: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఇవాళ అకౌంట్లలో నగదు జమ చేయనున్న జగన్ సర్కార్..

రూ.లక్షలోపు పంట రుణాలకు వడ్డీ రాయితీ, విపత్తులతో పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని ఏపీ ప్రభుత్వం అందించనుంది.  దీంతోపాటు గతంలో సాంకేతిక కారణాలతో గతంలో చెల్లింపులు జరగని రైతుల ఖాతాల్లో కూడా నగదు జమచేయనుంది.

YS Jagan: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఇవాళ అకౌంట్లలో నగదు జమ చేయనున్న జగన్ సర్కార్..
Ys Jagan
Follow us

|

Updated on: Nov 28, 2022 | 8:09 AM

Input subsidy to farmers: ఏపీలోని రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. రైతుల అకౌంట్లలో నగదు జమచేయనున్నారు. రూ.లక్షలోపు పంట రుణాలకు వడ్డీ రాయితీ, విపత్తులతో పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని ఏపీ ప్రభుత్వం అందించనుంది.  దీంతోపాటు గతంలో సాంకేతిక కారణాలతో గతంలో చెల్లింపులు జరగని రైతుల ఖాతాల్లో కూడా నగదు జమచేయనుంది. దాదాపు రూ.200 కోట్లపైగా నగదును సోమవారం 11గంటలకు సీఎం జగన్మోహన్‌రెడ్డి.. నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45,998 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. అంతకుముందు కురిసిన భారీ వర్షాలతో దాదాపు 60,832 ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది.

రైతులకు బకాయి ఉన్న సున్నా వడ్డీ నగదును సైతం సీఎం జగన్ జమ చేయనున్నారు. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల కింద 2020-21 రబీ, 2021 ఖరీఫ్‌ సీజన్లలో రూ.లక్షలోపు రుణాలు తీసుకుని, వడ్డీతోసహా చెల్లించిన 8,22,411 మంది రైతులకు వడ్డీ రీఎంబర్స్‌మెంట్‌ కింద రూ.160.55కోట్లు, ఖరీఫ్ లో వర్షాలకు నష్టపోయిన 45,998 మంది రైతులకు రూ.39.39కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీని సీఎం జగన్ రైతులకు అందించనున్నారు.

సీఎం జగన్.. ఈ నగదును తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారు. అయితే, దీనికి అర్హులో కాదోనన్న విషయాన్ని రైతు భరోసా కేంద్రానికి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయడి.