Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Araku: కమనీయం.. మనోహరం.. మనసును దోచేస్తున్న మాడగడ దృశ్యాలు.. మీరు చూశారా..?

ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన అరకులోయ అంటేనే ప్రకృతి అందాలకు నెలవు.... దీంతోపాటు ఏజెన్సీలోని పర్యటక ప్రాంతాలన్నీ సందర్శకులతో కలకలలాడుతున్నాయి. శీతాకాలం కావడం... ఆపై మంచు దట్టంగా కురవడంతో ఎంజాయ్ చేస్తున్నారు టూరిస్ట్‌లు.

Araku: కమనీయం.. మనోహరం.. మనసును దోచేస్తున్న మాడగడ దృశ్యాలు.. మీరు చూశారా..?
Madagada Fog
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 28, 2022 | 8:58 AM

అరకులోయ మండలంలోని మాడగడ మేఘసంద్రంకు పర్యాటకులు భారీ ఎత్తున తరలివచ్చారు. వరుస సెలవు దినాలు కావడంతో జనసంద్రంగా మారింది మాడగడ మేఘాల వ్యూ పాయింట్. వీకెండ్ కావడంతో పర్యాటకులు రద్దీ పెరిగింది. తెల్లవారుజామున 5 గంటల నుంచి పర్యాటకులు చేరుకుంటున్నారు. ఫోటోలతో సెల్ఫీలతో చిన్న పెద్ద తేడా లేకుండా కేరింతలు కొడుతూ పర్యటకులు ఉల్లాసంగా గడుపుతున్నారు.

ప్రకృతి సోయగాలు మరింత అందాలను అద్దుకుని పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. చలికాలం రాకతో అల్లూరి జిల్లాలోని మన్యం ప్రాంతం సరికొత్త సొగసులతో అలరిస్తోంది. సూర్యోదయాన లేలేత కిరణాలు ఆ మంచు మేఘాలను తాకగానే ఆ ప్రాంతం వెండి వర్ణంలో తల తల మెరిసిపోతోంది. అరకు పర్యటనకు వచ్చేవారికి ఈ ప్రాంతం అందాలు కనువిందు చేస్తున్నాయి. అరకులోయకు సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి వేకువజామునే పర్యాటకులు చేరుకుని సూర్యోదయం ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఎదురుచూస్తుంటారు.

రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో మన్యం ప్రాంతమంతా గజగజ వణుకుతోంది. చింతపల్లిలో 9.5 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. పాడేరు, అరకు వంటి ప్రాంతాల్లో 13 డిగ్రీల వరకు ఉష్ణ్రోగతలు నమోదవుతున్నాయి. హోటల్స్‌లో రూమ్స్ అన్ని ముందుగానే రిజర్వ్ అయిపోవడంతో చాలామంది పర్యాటకులు తమ సొంత వాహనాల్లోనే గడపవలసిన పరిస్థితి నెలకొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయడి.