Chandrababu: మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు.. టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో కేసు..
Chandrababu Naidu Arrest: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన విషయంత తెలిసిందే. అనంతరం రాజకీయంగా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అంతేకాకుండా.. చంద్రబాబుపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పటికే పలు కేసుల్లో సతమతమవుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో కేసు నమోదు చేసింది.

Chandrababu Naidu Arrest: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన విషయంత తెలిసిందే. అనంతరం రాజకీయంగా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అంతేకాకుండా.. చంద్రబాబుపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పటికే పలు కేసుల్లో సతమతమవుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో కేసు నమోదు చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబును ఏ3గా చేర్చుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న కేసులో ఏ 1 గా నరేష్, ఏ 2 గా కొల్లు రవీంద్ర, ఏ 3 గా చంద్రబాబు పేరును చేర్చారు. నిబంధనలకు విరుద్దంగా మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారని అభియోగాలు నమోదు చేసింది. పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టుగా సీఐడీ అధికారులు పేర్కొన్నారు.
ఇప్పటికే ఏపీ ఫైబర్ నెట్ కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసు, అంగళ్లు కేసుల్లో చంద్రబాబు పేరును చేర్చింది సీఐడీ. స్కిల్ కేసులో ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ అధికారులు చంద్రబాబును సెప్టెంబర్ 9న అరెస్టు చేసింది. అనంతరం చంద్రబాబును సీబీఐ కోర్టులో హాజరుపరచగా.. ఆయనకు రిమాండ్ విధించింది. చంద్రబాబు అరెస్టయి.. దాదాపు 52రోజులైంది. ఈ క్రమంలో ఆయనపై మరో కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..