సత్తాచాటిన ప్యాపిలి కుర్రాడు.. నరేంద్రమోదీ ప్రశంసలు..
భారత్ వివిధ రంగాల్లో సత్తా చాటుతోంది. వివిధ రకాల క్రీడల్లో క్రీడాకారులు రాణిస్తున్నారు. దేశప్రగతిని చాటుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ప్యాపిలికి చెందిన యువకుడు వెంకటనారాయణ, రాజస్థాన్‌కు చెందిన అనిత పారా రోయింగ్ పోటీల్లో సత్తా చాటారు. అక్టోబరు 26 నుంచి 28 వరకూ చైనాలోని హంగ్‌జోలో రోయింగ్ పీఆర్3 మిక్స్‌డ్ డబుల్ పోటీలు జరిగాయి. భారత్ తరపున వెంకటనారాయణ, అనిత పోటీల్లో పాల్గొన్నారు.
భారత్ వివిధ రంగాల్లో సత్తా చాటుతోంది. వివిధ రకాల క్రీడల్లో క్రీడాకారులు రాణిస్తున్నారు. దేశప్రగతిని చాటుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ప్యాపిలికి చెందిన యువకుడు వెంకటనారాయణ, రాజస్థాన్‌కు చెందిన అనిత పారా రోయింగ్ పోటీల్లో సత్తా చాటారు. అక్టోబరు 26 నుంచి 28 వరకూ చైనాలోని హంగ్‌జోలో రోయింగ్ పీఆర్3 మిక్స్‌డ్ డబుల్ పోటీలు జరిగాయి. భారత్ తరపున వెంకటనారాయణ, అనిత పోటీల్లో పాల్గొన్నారు. 2 కిలోమీటర్ల దూరాన్ని 8 నిమిషాల 50 సెకన్లలో రోయింగ్ చేసి రెండోస్థానంలో నిలిచి సిల్వర్ పతకం సాధించారు. ఈ పోటీల్లో భారత్ తో పాటు చైనా, థాయిలాండ్, ఉజికిస్తాన్, జపాన్, దేశాలకు చెందిన క్రీడాకారులు తలపడ్డారు. భారత్ ద్వితీయ స్థానంలో నిలవడం పట్ట భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. వెంకటనారాయణ, అనితలను అభినందిస్తూ ట్విట్ చేశారు . ప్యాపిలి క్రీడాకారుడు అంతర్జాతీయ స్థాయిలో భారత్ తరఫున పాల్గొని ప్రతిభ చాటడం పట్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్కేటింగ్ పై సోలో డ్యాన్స్.. అదరగొట్టిన హైదరాబాద్ కుర్రోడు..