Somu Veerraju: పవన్ చెప్పిన ఆ ఆప్షన్‌ను పరిగణలోకి తీసుకుంటాం.. సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు..
Somu Veerraju: ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. ఓవైపు ప్రతిపక్ష టీడీపీ, అధికార పార్టీ వైసీపీ పోటాపోటీగా ప్రజల్లోకి వెళుతూ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెంచేశారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్...
Somu Veerraju: ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. ఓవైపు ప్రతిపక్ష టీడీపీ, అధికార పార్టీ వైసీపీ పోటాపోటీగా ప్రజల్లోకి వెళుతూ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెంచేశారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా రాజకీయంగా చర్చకు దారి తీశాయి. మీడియాతో మాట్లాడిన పవన్ ఎన్నికల్లో పొత్తలకు సంబంధించి జనసేన ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయని తెలిపిన విషయం తెలిసిందే. వీటిలో బీజేపీతో కలిసి వెళ్లి ప్రభుత్వాన్ని స్థాపించడం, బీజేపీ, టీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం, జనసేన ఒక్కటే ప్రభుత్వాన్ని స్థాపించడం అని పవన్ చెప్పుకొచ్చారు.
అయితే పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. విజయవాడలో సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్వహించనున్న సభా ప్రాంగణ ఏర్పాట్లను పరిశీలించిన తర్వాత వీర్రాజు మీడియాతో పలు విషయాలను పంచుకున్నారు. పవన్ వ్యాఖ్యలపై సోము వీర్రాజు స్పందిస్తూ.. రాష్ట్రంలో బీజేపీ, జనసేన కలిసే ముందుకు వెళుతుందని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాన్న వీర్రాజు పవన్ చెప్పిన మొదటి ఆప్షన్‌నే మేము పరిగణలోకి తీసుకుంటామన్నారు. రెండో ఆప్షన్ అంశం టిడిపి వారినే అడగండని, ఎవరు మెట్టు దిగుతారో, ఎవరు మెట్టు ఎక్కుతారో త్వరలోనే తెలుస్తుందని చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందని, ఆత్మకూరు ఉప ఎన్నిక ద్వారా దీనికి సమాధానం చెబుతామని వీర్రాజు అన్నారు. కుటుంబ రాజకీయాలకు ఫుల్‌స్టాప్ పెట్టడమే తమ లక్ష్యమని అన్నారు. వైసీపీ తీరును అందరూ తప్పుబడుతున్నారని, అందుకనే తాము ఆత్మకూరు బరిలో దిగినట్టు పేర్కొన్నారు. ప్రజలు, ప్రతిపక్షాలు ఈ విషయాన్ని గమనించాలని చెప్పుకొచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..