BJP: రేషన్ బియ్యం-నగదు బదిలీపై ఏపీలో రచ్చ.. ఏపీ బీజేపీ సంచలన ఆరోపణలు..
Ration Rice Cash Transfer: తెలంగాణలోనే కాదు, ఏపీలోనూ రైస్‌పై రచ్చ జరుగుతోంది. తెలంగాణలో బాయిల్డ్ బియ్యంపై రగడ జరుగుతుంటే, ఏపీలో రేషన్ రైస్‌పై వార్ స్టార్ట్ అయ్యింది. పేదల రేషన్ బియ్యంపై అసలు గొడవేంటి? విపక్షాలు ఏమంటున్నాయ్? ప్రభుత్వం ఏం చెబుతోంది?
రేషన్ బియ్యానికి(Ration-Rice) నగదు బదిలీ(Cash Transfer), పైలట్ ప్రాజెక్ట్ కింద ఇంప్లిమెంట్ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. ఏపీ సర్కార్. రేషన్ రైస్ వద్దనుకునేవాళ్లకు ఆ మేరకు డబ్బును అకౌంట్లో జమ చేయడమే ఈ స్కామ్. అయితే, ఎంతిస్తారు? కిలో బియ్యాన్ని ఎంతకు కొంటారు? ఇదింకా ఫైనల్ కాలేదు. కానీ, దీని వెనక పెద్ద కుట్రే ఉందంటున్నారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. బ్లాక్ మార్కెటింగ్ మాఫియాతోపాటు ప్రభుత్వ పెద్దల హస్తం ఇందులో ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. 40 రూపాయల ఖరీదైన బియ్యానికి 15 రూపాయలు చెల్లిస్తారా? ఇదెక్కడి విడ్డూరం అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టాల్సిన ప్రభుత్వమే, మాఫియాగా మారితే ప్రజలకు న్యాయమెలా జరుగుతుందంటున్నారు సోము వీర్రాజు.
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆరోపణలను సింగిల్ లైన్‌తో కొట్టేశారు సివిల్ సప్లై మినిస్టర్ కారుమూరి నాగేశ్వరరావు. అసలీ పథకం తాము తెచ్చింది కాదన్నారు. మీ బీజేపీ ఏలుతున్న కేంద్ర ప్రభుత్వం చెబితేనే ఇంప్లిమెంట్ చేస్తున్నామంటూ కౌంటరిచ్చారు కారుమూరి. అదే టైమ్‌లో రేషన్ బియ్యం-నగదు బదిలీపై ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. బియ్యం కావాలంటే బియ్యం ఇస్తాం, నగదు కావాలంటే నగదు ఇస్తాం, ఇందులో ఎలాంటి బలవంతం లేదన్నారు మంత్రి కారుమూరి.
మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రైస్… రచ్చ రాజేస్తోంది. తెలంగాణలో బాయిల్డ్ రైస్‌పై వార్ జరుగుతుంటే, ఏపీలో రేషన్ రైస్ ప్రకంపనలు రేపుతోంది. మరి, ఈ రైస్ రాజకీయం ముందుముందు ఎలాంటి సంచలనాలకు తెరలేపుతుందో..!
ఇవి కూడా చదవండి: CM Jagan: సీనియర్లే ఇలా చేస్తే ఎలా.. మంత్రి కాకాని, అనిల్‌కు సీఎం జగన్ క్లాస్..