Andhra Pradesh: ఏపీలో కొత్త పార్టీ..? బ్రదర్ అనిల్‌తో వివిధ సంఘాల నేతలు భేటీ
బ్రదర్ అనిల్ సారథ్యంలో కొత్తగా నేషనల్ పార్టీ రాబోతుందా..? ఆంధ్రాలో మరో ప్రత్యామ్నాయపార్టీ వస్తోందా..? బీసీ, మైనార్టీ, క్రిస్టియన్ అసోసియేషన్ నేతల సమావేశంలో ఇదే అంశాన్ని చర్చించినట్లు తెలుస్తోంది.
Brother Anil: బ్రదర్ అనిల్‌తో ఏపీలోని వివిధ సంఘాల నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక విషయాలపై చర్చలు జరిపారు. బ్రదర్ అనిల్ చెప్పడం వల్లే గత ఎన్నికల్లో జగన్‌కు సపోర్ట్ చేశామని.. ఇప్పుడు సీఎం బీసీలను పట్టించుకోవడం లేదని బీసీ సంఘం నేతలు పేర్కొన్నారు. జగన్ సీఎం అయ్యాక రెండేళ్లుగా కలిసేందుకు సమయం కూడా ఇవ్వలేదని.. ఎన్నో బాధలు పడుతున్నామని వారు అనిల్‌తో చెప్పారు. ఎస్సీలకు సబ్ ప్లాన్ నిధులు కూడా ఇవ్వడం లేదని వాపోయారు. ఏపీలో కొత్త పార్టీ పెట్టాలని బ్రదర్ అనిల్‌ను బీసీ నేతలు కోరారు. అవసరమైతే జాతీయ పార్టీ పెట్టాలని రిక్వెస్ట్ చేశారు. ఏ నిర్ణయం తీసుకున్నా వెంటే ఉంటామని వివిధ సంఘాల నేతలు బ్రదర్ అనిల్‌కు తెలిపారు. కొత్తపార్టీపై బ్రదర్ అనిల్ క్లారిటీ ఇచ్చారు. తానూ ఎలాంటి పార్టీ పెట్టడం లేదన్నారు. కేవలం బీసీ, మైనార్టీ, క్రిస్టియన్ అసోసియేషన్ నేతలు తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారన్నారు. పార్టీ పెడుతున్నానని తప్పుడు ప్రచారం చేయొద్దని మీడియాకు సూచించారు.