AP Assembly Session: ఏపీ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు.. కొట్టుకున్న టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు
ఏపీ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సభలో టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు కొట్టుకున్నారు. ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు మధ్య ఘర్షణ జరిగింది.

ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు మధ్య ఘర్షణ జరిగింది. శాసనసభలో చర్చ జరుగుతుండగా టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. దీనిపై వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత వైసీపీకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా అక్కడికి చేరుకున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
బాలవీరాంజనేయస్వామి, సుధాకర్‌బాబు మధ్య ఈ ఘర్షణ జరిగింది. సుధాకర్‌బాబును అడ్డుకున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. సుధాకర్‌బాబుకు మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లారు. టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తడంతో సభ వాయిదా పడింది. అసెంబ్లీ వెల్‌లో టీడీపీ సభ్యుల నిరసనకు దిగారు.
అసెంబ్లీ లైవ్ కోసం..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం