AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Assembly: కల్తీ మద్యంపై టీడీపీ.. పెగాసస్ ఆయుధంగా వైసీపీ.. ఇవాళ హాట్ హాట్‌గా సాగనున్న అసెంబ్లీ!

కల్తీ మద్యం గురించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని తెలుగుదేశం పార్టీ, పెగాసస్‌ను ఆయుధంగా చేసుకొని టీడీపీని లాక్‌ వైసీపీ సభకు వస్తున్నాయి. దీంతో ఇవాళ్టి అసెంబ్లీ సమావేశాలపై ఆసక్తి నెలకొంది.

AP Assembly: కల్తీ మద్యంపై టీడీపీ.. పెగాసస్ ఆయుధంగా వైసీపీ.. ఇవాళ హాట్ హాట్‌గా సాగనున్న అసెంబ్లీ!
Ap Assembly
Balaraju Goud
|

Updated on: Mar 21, 2022 | 6:33 AM

Share

Andhra Pradesh Assembly: కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. కల్తీ మద్యం(Illegal Liquor) గురించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని తెలుగుదేశం పార్టీ, పెగాసస్‌(Pegasus)ను ఆయుధంగా చేసుకొని టీడీపీ(TDP)ని లాక్‌ వైసీపీ(YCP) సభకు వస్తున్నాయి. దీంతో ఇవాళ్టి అసెంబ్లీ సమావేశాలపై ఆసక్తి నెలకొంది. వాతావరణం కాస్త చల్లబడ్డా, ఏపీలో రాజకీయాలు మాత్రం హాట్‌హాట్‌గానే ఉన్నాయి. ఇప్పటికే టీడీపీ, వైసీపీ మధ్య పచ్చగడ్డి భగ్గుమంటోంది. దానికి కల్తీ మద్యం, పెగాసస్‌ తోడయ్యాయి. వీటి ఎంట్రీతో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.

నిన్నామొన్న నాటుసారా, కల్తీమద్యంపై పోరుబాట పట్టింది తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేశారు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు. అటు జంగారెడ్డిగూడెం మరణాలపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కల్తీ మద్యాన్ని నిషేధించాలని ఆందోళనకు దిగాయి టీడీపీ శ్రేణులు. ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద ధర్నా చేపట్టారు టీడీపీ నేతలు. రోడ్డుపై మద్యం బాటిల్స్‌ని పగలగొట్టి నిరసన వ్యక్తం చేశారు. అటు అసెంబ్లీలోనూ ఈ ఇష్యూపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని యోచిస్తోంది టీడీపీ. అయితే, వైసీపీ తెలుగుదేశం పార్టీకి కౌంటర్‌ ఇవ్వడానికి మరో బలమైన ఆయుధాన్ని తెరపైకి తెవడానికి రెడీ అయ్యింది.

ఇటీవల బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చంద్రబాబుపై చేసిన పెగాసస్‌ కామెంట్స్‌, అధికార పార్టీకి ఆయుధంగా మారాయి. చంద్రబాబు పెగాసస్‌ను కొనుగోలు చేశారని దీదీ చెప్పడం, వైసీపీకి ప్లస్‌ పాయింట్‌గా చెప్పవచ్చు. ఈ ఇష్యూతో టీడీపీకి చెక్‌ పెట్టేందుకు రెడీ అయ్యింది వైసీపీ. దీంతో ఇవాళ్టి అసెంబ్లీ సమావేశాలపై సర్వాత్రా ఆసక్తి నెలకొంది. రోజులాగే టీడీపీ సభ్యులపై ఇవాళ కూడా సస్పెన్షన్‌ వేటు పడుతుందా? లేక వారిని సభలోనే ఉండనిచ్చి, పెగాసస్‌తో వారిపై మాటల దాడి చేస్తారా అన్నది చూడాలి. ఏదేమైనా, ఒకరినొకరు ఇరుకున పెట్టేందుకు, ఆయుధాలను సిద్ధం చేసుకొని వెళ్లడం ఏపీలో అటెన్షన్‌ క్రియేట్ చేస్తోంది.

Read Also… 

Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే