Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే
ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) తీపి కబురు చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు (Guntur) మీదుగా ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయించింది. ఈ మేరకు గుంటూరు డివిజన్ రైల్వే అధికారి...
ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) తీపి కబురు చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు (Guntur) మీదుగా ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయించింది. ఈ మేరకు గుంటూరు డివిజన్ రైల్వే అధికారి ఒకరు వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్ (Secunderabad) నుంచి ఎర్నాకుళం వెళ్లే రైలును ఏప్రిల్, మే, జూన్ నెలల్లో నడిపిస్తున్నట్లు తెలిపారు. ప్రతి శుక్రవారం సికింద్రాబాద్‌లో 21.05 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు(07189).. నల్గొండ 22.35, మిర్యాలగూడ 23.07, పిడుగురాళ్ల 23.55, గుంటూరు శనివారం 01.40, ఎర్నాకుళం 20.15 గంటలకు చేరుతుందని వివరించారు. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు (07190) ఎర్నాకుళంలో ప్రతి శనివారం 23.25 గంటలకు బయలుదేరి గుంటూరు ఆదివారం 16.50, పిడుగురాళ్ల 18.00, మిర్యాలగూడ 18.48, నల్గొండ 19.35, సికింద్రాబాద్ 23.30 గంటలకు చేరుతుందని పేర్కొన్నారు.
అదేవిధంగా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ప్రతి శని, మంగళ, గురువారాల్లో బయలుదేరే ప్రత్యేక రైలు(07067) మచిలీపట్నంలో 15.50 గంటలకు బయలుదేరి గుడివాడ 16.18, విజయవాడ 17.20, గుంటూరు 18.25, నరసరావుపేట 19.14, కర్నూలు మరుసటిరోజు 05.10 గంటలకు చేరుతుందని తెలిపారు. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07068) ప్రతి ఆది, బుధ, శుక్రవారాల్లో కర్నూలులో 20.00 గంటలకు బయలుదేరి నరసరావుపేట మరుసటిరోజు 01.39, గుంటూరు 03.35, విజయవాడ 04.50, గుడివాడ 05.48, మచిలీపట్నం 07.05 గంటలకు చేరుతుందని చెప్పారు.
Also Read
Stretch Marks: స్ట్రెచ్ మార్కులతో ఇబ్బందులు పడుతున్నారా? తేనె తో ఇలా చెక్ చెప్పండి..!
సంబురాలు చేసుకున్న కొద్ది గంటల్లోనే హాహాకారాలు.. విషాదం నింపిన కార్నివాల్ వేడుకలు