Andhra Pradesh: పరిటాల రవిని మరోసారి ఏమైనా అన్నారో.. ఎమ్మెల్యేకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పరిటాల సునిత..
Andhra Pradesh: అనంతపురం రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిపై మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటా శ్రీరామ్..
Andhra Pradesh: అనంతపురం రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిపై మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటా శ్రీరామ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. పరిటాల రవి కాలి గోటికి కూడా ప్రకాష్ రెడ్డి సరిపోడని నిప్పులు చెరిగారు. ‘‘ఏదైనా ఉంటే మమ్మలని విమర్శించు.. సమాధానం ఇస్తాం’’ అని ఘాటుగా స్పందించారు. పరిటాల రవిపై ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై సునీత, శ్రీరామ్ ఈ విధంగా రియాక్ట్ అయ్యారు. ఇదే అంశంలో ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన వీరు.. కారు బాంబుతో మారణహోమం సృష్టించింది ఎవరు? అని ప్రశ్నించారు. గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు రేపుతున్నది ఎవరు? అని అన్నారు. మరోసారి పరిటాల రవి గురించి విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో పోలీసుల వ్యవహారశైలిపైనా విమర్శలుచేశారు సునీత, శ్రీరామ్. కొందరు పోలీసులు వైసీపీ చొక్కాలు వేసుకొని పనిచేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేరూరు డ్యామ్ కు ఎక్కడ నీరు ఇచ్చారో సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిని డిమాండ్ చేశారు. మూడేళ్లుగా రైతులకు ఏం చేశారని నిలదీశారు. రైతు సమస్యలపై అసెంబ్లీలో సీఎంను ఎందుకు నిలదీయలేకపోతున్నారని ప్రశ్నించారు.
Also read:
Putin Dress: ‘వార్’లోనే కాదు.. ‘వేరింగ్’లోనూ ‘తగ్గేదే లే’ అంటున్న పుతిన్.. 10 లక్షల విలువైన..
Stretch Marks: స్ట్రెచ్ మార్కులతో ఇబ్బందులు పడుతున్నారా? తేనె తో ఇలా చెక్ చెప్పండి..!