ఏపీలో వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్ల ప్రారంభానికి సర్కార్ ఏర్పాట్లు.. ‘నాడు-నేడు’లో భాగంగా భారీ మార్పులు

ఏపీలో వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్ల ప్రారంభానికి సర్కార్ ఏర్పాట్లు.. 'నాడు-నేడు'లో భాగంగా భారీ మార్పులు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రీ ప్రైమరీ స్కూల్స్( అంగన్‌వాడీ కేంద్రాలు) పున: ప్రారంభం అవ్వనున్నాయి. ఫిబ్రవరీ 1వ తేదీన ప్రీ ప్రైమరీ స్కూళ్లను ఆరంభించడానికి జగన్ సర్కార్ అడుగులు వేస్తుంది.

Ram Naramaneni

|

Jan 18, 2021 | 6:06 PM

ఆంధ్రప్రదేశ్‌లో ప్రీ ప్రైమరీ స్కూల్స్( అంగన్‌వాడీ కేంద్రాలు) పున: ప్రారంభం అవ్వనున్నాయి. ఫిబ్రవరీ 1వ తేదీన ప్రీ ప్రైమరీ స్కూళ్లను ఆరంభించడానికి జగన్ సర్కార్ అడుగులు వేస్తుంది. ‘నాడు-నేడు’ స్కీమ్ కింద ఏపీలోని అంగన్‌వాడీ సెంటర్లను గవర్నమెంట్  ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చివేసింది. ప్రభుత్వ పాఠశాలల తరహాలో విప్లవాత్మకమైన మార్పులు చేసింది. అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించింది. అన్ని వసతులతో పాటు పౌష్టికాహారం కూడా పిల్లలకు అందించబోతోంది.  నాడు-నేడు కింద.. ఏపీలో మొత్తం 55,608 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటి ద్వారా 3 నుంచి 6 ఏళ్ల వయసున్న దాదాపు తొమ్మిది లక్షల మంది పిల్లలకు అన్ని వసతులతో కూడిన ప్రీ స్కూల్‌ విద్యా బోధనను అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం.

ప్రీ ప్రైమరీ స్కూల్స్‌లో ప్రభుత్వం మరుగుదొడ్లను నిర్మించింది. శుద్ధి చేసిన మంచినీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. కావాల్సిన ఫర్నిచర్ సమకూర్చింది. ప్రీ ప్రైమరీ స్కూళ్లను వైఎస్సార్ ప్రీ ప్రైమరీ-1, వైఎస్సార్ ప్రీ ప్రైమరీ-2, వైఎస్సార్ ప్రీ ఫస్ట్ క్లాస్‌ తరగతులను ఏర్పాటు చేసింది. నాణ్యమైన విద్యాబోధనతో పాటు పిల్లలకు పాలు, గుడ్లు, ఇతర పౌష్టికాహారాన్ని అందించడానికి నాలుగు వేల కోట్ల రూపాయలను కేటాయించింది.

ప్రీ ప్రైమరీ స్కూల్స్‌లో సౌకర్యాలు ఇవి:

  1.  ప్రతి చిన్నారికి పుస్తకాలు, ప్రీ స్కూల్‌ కిట్స్, కలర్‌ కార్డులు, బిల్డింగ్‌ బ్లాక్స్, ఫ్లాష్‌ కార్డులు, పోస్టర్లు, చార్ట్స్, లెర్నింగ్‌ కిట్స్‌
  2. మధ్యలో చిన్నారులు విశ్రాంతి తీసుకోవడానికి గంటన్నర పాటు విరామం
  3. శుద్ధి చేసిన త్రాగునీరు సరఫరా
  4. పిల్లలకు బలమైన పౌష్టికాహారం
  5. రీడింగ్, స్టోరీ టైం, స్టోరీ టెల్లింగ్, క్రియేటివ్‌ యాక్టివిటీ తదితర అంశాలతో పిల్లలకు విద్యాబోధన

Also Read:

AP CM Jagan Delhi tour: రేపు ఢిల్లీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. అమిత్‌షాతో భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

AP School Mobile App: ఏపీ స్కూళ్లలో టాయిలెట్స్‌ నిర్వహణ, విద్యార్థుల హాజరు కోసం మొబైల్‌ యాప్‌

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu