Andhra Pradesh: ఏపీలో తప్పిన మరో రైలు ప్రమాదం.. లేకపోతే ఊహించని పరిణామం

ఒడిషాలోని శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదం అందరిని కంటతడి పెట్టిస్తోంది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 278 మంది చనిపోగా.. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో మరింత ఆందోళనలు నెలకొన్నాయి.

Andhra Pradesh: ఏపీలో తప్పిన మరో రైలు ప్రమాదం.. లేకపోతే ఊహించని పరిణామం
Train
Follow us

|

Updated on: Jun 03, 2023 | 4:09 PM

ఒడిషాలోని శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదం అందరిని కంటతడి పెట్టిస్తోంది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 278 మంది చనిపోగా.. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో మరింత ఆందోళనలు నెలకొన్నాయి. ఓ వైపు దేశ ప్రజలు ఈ రైలు ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తుండగానే ఆంధ్రప్రదేశ్‌లో మరో రైలు ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే సత్యసాయి జిల్లా కదిరి రైల్వే స్టేషన్ వద్ద.. నాగర్ కోయిల్-ముంబయి రైలు వచ్చే సమయంలో గేట్‍‌మెన్ గేటు వేయలేదు.

వాహనాదారులు అలానే రైల్వ్ ట్రాక్ దాటుతున్నారు. ఇది గమనించిన లోకో పైలట్ వెంటనే రైలును ఆపేశాడు. దీంతో వాహనాదారులు ఊపిరి పీల్చుకున్నారు. గేట్‌మెన్ చేసిన నిర్లక్ష్యంపై వాహనాదారులు, స్థానికులు మండిపడుతున్నారు. ఒకవేల లోకో పైలట్ ట్రైన్ ఆపకపోతే మరో ప్రమాదం జరిగేదని ఆందోళన వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన అధికారులు గేట్‌మెన్ నిర్లక్ష్యంపై విచారణ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..