AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Politics: అధికార పార్టీ వైసీపీకి ఊహించని షాక్.. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి రాజీనామా

మచిలీపట్నం ఎంపీగా ఉన్న బాలశౌరి వైఎస్ఆర్‌సీపీకి రాజీనామా చేశారు. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇంతకాలం ఈయన అత్యంత ఆప్తుడుగా కొససాగారు. అలాంటి వ్యక్తి రాజీనామా చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. త్వరలోనే బాలశౌరి జనసేన పార్టీ లో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది.

AP Politics: అధికార పార్టీ వైసీపీకి ఊహించని షాక్.. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి రాజీనామా
Balashauri With Pawan Kalyan
Balaraju Goud
|

Updated on: Jan 13, 2024 | 6:51 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నియోజకవర్గాల ఇంచార్జుల, అభ్యర్థుల మార్పులతో అధికార పార్టీ వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సిట్టింగు ఎంపీ, ఎమ్మెల్యేలను కాదని కొత్త వారికి అవకాశం ఇస్తుండటంతో అధినేత వైఎస్ జగన్‌కు షాకిస్తున్నారు నేతలు. ఇప్పటికే పలువురు ఎమ్మె్ల్యేలు రాజీనామా చేయగా.. మరికొందరు ఎంపీ, ఎమ్మెల్యేలు అదే బాటలో నడుస్తున్నారు.

తాజాగా.. మచిలీపట్నం ఎంపీగా ఉన్న బాలశౌరి వైఎస్ఆర్‌సీపీకి రాజీనామా చేశారు. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇంతకాలం ఈయన అత్యంత ఆప్తుడుగా కొససాగారు. అలాంటి వ్యక్తి రాజీనామా చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. త్వరలోనే బాలశౌరి జనసేన పార్టీ లో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది.

గత కొద్దిరోజులగా స్థానిక నేతల తీరుతో మనస్తాపానికి గురైన బాలశౌరి.. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.ఈ నేపథ్యంలో రాజకీయాల్లో చురుకుగా ఉండే బాలశౌరి కొద్దిరోజులుగా మచిలీపట్నానికి దూరంగా ఉంటున్నారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని తన సహాచరులతో చెప్పుకుంటూ వచ్చిన బాలశౌరి, పార్టీకి రాజీనామా చేయడం కోనసీమ జిల్లాల్లో సంచలనంగా మారింది. అలాగే మచిలీపట్నం స్థానం నుంచి మరో వ్యక్తిని బరిలోకి దింపడానికి వైసీపీ హైకమాండ్ ప్రయత్నిస్తున్నట్లు ముందుగానే తెలుసుకున్న బాలశౌరి.. ఇలా రాజీనామా చేశారనే టాక్ వినిపిస్తోంది.

ఇదిలావుంటే బాలశౌరి వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారట. అందుకే ఎంపీగా రాజీనామా చేశారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇదిలావుంటే మచిలీపట్నం నియోజకవర్గంలో మాజీ మంత్రి పేర్ని నానికి, ఎంపీ బాలశౌరికి మధ్య కొంతకాలంగా రోజులు అస్సలు పొసగడం లేదన్న విషయం అందరికీ తెలిసిందే! మరోవైపు వచ్చే ఎన్నికల్లో పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు మచిలీపట్నం స్థానం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతుండటం విశేషం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి