AP Rains: మాయదారి వాన మళ్లీ వస్తోంది.. ఏపీలో వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్

వర్షం తగ్గింది.. బురద పోతోంది.. ఏపీ వాసులు హమ్మయ్యా అనుకుంటుండగా వాతావరణ శాఖ మరోసారి హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే వర్షాలు దాదాపుగా తగ్గుముఖం పట్టాయి. ఆ వివరాలు ఇలా..

AP Rains: మాయదారి వాన మళ్లీ వస్తోంది.. ఏపీలో వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్
Ap Rains
Follow us

|

Updated on: Sep 13, 2024 | 8:14 AM

వర్షం తగ్గింది.. బురద పోతోంది.. ఏపీ వాసులు హమ్మయ్యా అనుకుంటుండగా వాతావరణ శాఖ మరోసారి హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే వర్షాలు దాదాపుగా తగ్గుముఖం పట్టాయి. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వానలు పడుతున్నాయి. ఈ తరుణంలో వచ్చే 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది రాబోయే 2 రోజుల్లో వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. దీని ప్రభావం పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గడ్, బీహార్ రాష్ట్రాలపై ఎక్కువగా ఉందని.. ఆయా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడతాయంది వాతావరణ శాఖ తెలిపింది.

ఇది చదవండి: శ్వాసలో దుర్వాసన, దగ్గుతో ఆస్పత్రికెళ్లిన వ్యక్తి.. CT స్కాన్ చేయగా బిత్తరపోయిన వైద్యులు

ఇవి కూడా చదవండి

ఏపీపై ఈ అల్పపీడనం ప్రభావం స్వల్పంగానే ఉన్నా.. రాబోయే 3 రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అటు ఈ నెల 20 నుంచి అక్టోబర్ మొదటివారం వరకు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండొచ్చునన్నారు. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

మరోవైపు తెలంగాణలోనూ వర్షాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సెప్టెంబర్ 17 వరకు పలు ప్రాంతాల్లో మినహా మిగిలిన అన్ని చోట్లా వర్షాలకు బ్రేక్ వచ్చినట్టే అని చెప్పింది. అయితే ఇది కేవలం చిన్న విరామం మాత్రమేనని.. సెప్టెంబర్ 18 నుంచి మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ.

ఇది చదవండి: రసికులకే పాఠాలు చెప్పి.. ఏకంగా ఎన్ని కోట్లు సంపాదించాడో తెల్సా

ఇది చదవండి: తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికెళ్లిన మహిళ.. స్కాన్ చేసి చూడగా దిమ్మతిరిగింది

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..