Chanakya Niti: భర్త చేసే ఈ తప్పులను భార్య అస్సలు దాచిపెట్టకూడదు.. అవేంటో తెల్సా

వైవాహిక బంధం బలంగా ఉండాలంటే.. భార్యాభర్తలు ఎప్పుడూ పాలు, నీళ్లలా కలిసిపోవాలి. ఇక అప్పుడప్పుడూ భర్త అలవాట్లను, చెడు ప్రవర్తనను భార్య దాచిపెడుతుంది.

Chanakya Niti: భర్త చేసే ఈ తప్పులను భార్య అస్సలు దాచిపెట్టకూడదు.. అవేంటో తెల్సా
Telugu Chanakya Niti
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 12, 2024 | 5:51 PM

వైవాహిక బంధం బలంగా ఉండాలంటే.. భార్యాభర్తలు ఎప్పుడూ పాలు, నీళ్లలా కలిసిపోవాలి. ఇక అప్పుడప్పుడూ భర్త అలవాట్లను, చెడు ప్రవర్తనను భార్య దాచిపెడుతుంది. ఇలాంటి తప్పును భార్య అస్సలు చేయకూడదని.. భవిష్యత్తులో ఆమె ఇబ్బందులు ఎదుర్కుంటుందని చాణక్య నీతిలో పేర్కొనబడి ఉంది. ఇంతకీ భార్య దాచిపెట్టకూడని.. ఆ భర్త అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

ఇది చదవండి: శ్వాసలో దుర్వాసన, దగ్గుతో ఆస్పత్రికెళ్లిన వ్యక్తి.. CT స్కాన్ చేయగా బిత్తరపోయిన వైద్యులు

అబద్ధం:

భర్త అబద్ధాలను భార్య ఎప్పుడూ కప్పిపుచ్చకూడదని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. భర్తకున్న ఈ అలవాటును భార్య తన కుటుంబసభ్యులకు తెలియజేయాలి. లేకుంటే ఆమె జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇవి కూడా చదవండి

అనుమానపు అలవాటు:

కొన్నిసార్లు భర్త అందరి ముందు తన భార్యను అవమానపరుస్తాడు. అయితే ఈ విషయాన్ని భార్య తన మనసులోనే దాచుకోకుండా.. ఇంట్లోని కుటుంబసభ్యులకు చెప్పాలి. లేకుండా ఆమెకు సమస్యలు ఎదురవుతాయి.

ఇది చదవండి: రసికులకే పాఠాలు చెప్పి.. ఏకంగా ఎన్ని కోట్లు సంపాదించాడో తెల్సా

కోపం తెచ్చుకోవడం:

కొందరు మగవారికి ముక్కు మీద కోపం. చిన్న చిన్న విషయాలకు కూడా భార్యపై కోపం తెచ్చుకుంటూ ఉంటారు. భర్తకున్న ఈ స్వభావాన్ని భార్య సహిస్తుంది. కానీ మితిమీరిన కోపం వైవాహిక బంధంలో అగాధాన్ని సృష్టిస్తుంది. భర్తలోని ఈ గుణాన్ని భార్య తన పుట్టింటివారికి, అత్తింటివారికి చెప్పడం తప్పనిసరి.

మరో స్త్రీ సాంగత్యం:

భార్యభర్తల మధ్య నమ్మకం ఉండాలి. ఇదే వారి మధ్య బంధానికి పునాది. కానీ ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. చాలామంది మగవారు బయట రెండో మహిళతో సాంగత్యంలో ఉంటూ.. భార్యను మోసం చేస్తుంటారు. చాణక్యుడి చెప్పిన సూత్రాల ప్రకారం.. ఒక పురుషుడు భార్యకు తెలియకుండా మరొక స్త్రీతో సహజీవనం చేస్తే.. అది వైవాహిక జీవితపు పునాదిని కదిలిస్తుంది. ఒకవేళ భర్తకు సంబంధించిన ఈ రహస్యం.. భార్యకు తెలిస్తే.. అది అస్సలు దాచకూడదు.

ఇది చదవండి: తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికెళ్లిన మహిళ.. స్కాన్ చేసి చూడగా దిమ్మతిరిగింది

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి