బాబోయ్‌.. పొడవాటి ముక్కుతో 4 అడుగుల కొత్త జాతి పాము ఆచూకీ లభ్యం..! ఎక్కడంటే..

పరిశోధకుల బృందం చెప్పిన వివరాల మేరకు.. ఇప్పటివరకు ఈ పాము బీహార్, మేఘాలయలోని రెండు ప్రదేశాలలో మాత్రమే కనిపించింది. ఈ పాము పొడవు 4 అడుగుల వరకు ఉంటుంది. దీని తల త్రిభుజాకారంలో ఉంటుంది. దాని ముక్కు చాలా పొడవుగా ఉంటుంది. దీని ముక్కు దాని తల పొడవులో దాదాపు 18 శాతం ఉంటుందని చెప్పారు.

బాబోయ్‌.. పొడవాటి ముక్కుతో 4 అడుగుల కొత్త జాతి పాము ఆచూకీ లభ్యం..! ఎక్కడంటే..
New Long Nosed Snake
Follow us

|

Updated on: Sep 12, 2024 | 5:13 PM

పాముల్లో చాలా రకాలు ఉన్నాయి. విషపూరితమైన పాములు, విషంలేని పాములతో పాటు.. రంగు రంగుల పాములు కూడా కనిపిస్తాయి. కానీ, మీరు ఎప్పుడైనా పొడవాటి ముక్కు ఉన్న పామును చూశారా..? బహుశా మీ సమాధానం లేదు అనే ఉంటుంది. ఎందుకంటే ఇది కొత్త జాతి పాము. బీహార్‌లోని పశ్చిమ చంపారన్‌లోని వాల్మీకి టైగర్ రిజర్వ్ సమీపంలో ఈ కొత్త జాతి పామును గుర్తించారు పరిశోధకులు. ఈ పాము ప్రత్యేకత ఏమిటంటే ఈ పాము పొడవైన ముక్కు కలిగి ఉంది.. శాస్త్రవేత్తలు దీనికి అహతుల్లా లాంగిరోస్ట్రిస్ అని పేరు పెట్టారు. అంటే ‘పొడవైన ముక్కు గల పాము. వాల్మీకి టైగర్ రిజర్వ్ సమీపంలో ఈ పాము చనిపోయింది. ఈ పాము జాతిని తెలుసుకోవడానికి DNA పరీక్ష చేయగా, DNA పరీక్షలో ఇది పూర్తిగా కొత్త జాతి పాము అని తేలింది. ఈ ఆవిష్కరణ ‘జర్నల్ ఆఫ్ ఆసియా-పసిఫిక్ బయోడైవర్సిటీ’లో ప్రచురించబడింది.

‘జర్నల్ ఆఫ్ ఆసియా-పసిఫిక్ బయోడైవర్సిటీ’లో ప్రచురించిన నివేదిక ప్రకారం, డిసెంబర్ 2021లో శాస్త్రవేత్తలు సౌరభ్ వర్మ, సోహమ్ పట్టేకర్ వాల్మీకి టైగర్ రిజర్వ్ సమీపంలో పరిశీలిస్తుండగా, అక్కడ వారు చనిపోయిన 4 అడుగుల పొడవైన పామును చూశారు. ఈ పాము ముక్కు అసాధారణంగా పొడవుగా ఉండటం గమనించారు. దీంతో ఈ పాము వారి దృష్టిని ఆకర్షించింది. వారు పాము నమూనాలను సేకరించి DNA పరీక్ష ప్రారంభించారు. ఇది పూర్తిగా కొత్త జాతి పాము అని నిర్ధారించారు.

పరిశోధకుల బృందం చెప్పిన వివరాల మేరకు.. ఇప్పటివరకు ఈ పాము బీహార్, మేఘాలయలోని రెండు ప్రదేశాలలో మాత్రమే కనిపించింది. ఈ పాము పొడవు 4 అడుగుల వరకు ఉంటుంది. దీని తల త్రిభుజాకారంలో ఉంటుంది. దాని ముక్కు చాలా పొడవుగా ఉంటుంది. దీని ముక్కు దాని తల పొడవులో దాదాపు 18 శాతం ఉంటుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

బాబోయ్‌.. పొడవాటి ముక్కుతో 4 అడుగుల కొత్త జాతి పాము ఆచూకీ లభ్యం..
బాబోయ్‌.. పొడవాటి ముక్కుతో 4 అడుగుల కొత్త జాతి పాము ఆచూకీ లభ్యం..
నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఆన్‌లైన్‌లో సాఫ్ట్‌వేర్‌ శిక్షణ..
నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఆన్‌లైన్‌లో సాఫ్ట్‌వేర్‌ శిక్షణ..
రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధం ఆపడానికేనా.? అది భారత్ కే సాధ్యమా.!
రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధం ఆపడానికేనా.? అది భారత్ కే సాధ్యమా.!
పెళ్లి పీటలెక్కనున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ అను..
పెళ్లి పీటలెక్కనున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ అను..
ఐపీఎల్ మెగా వేలం ఎప్పుడు జరుగుతుంది.. రిటైన్ లిస్ట్ ఇదే..?
ఐపీఎల్ మెగా వేలం ఎప్పుడు జరుగుతుంది.. రిటైన్ లిస్ట్ ఇదే..?
సల్మాన్ వాచ్‌లో 714 వజ్రాలు.. ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు
సల్మాన్ వాచ్‌లో 714 వజ్రాలు.. ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు
ఐక్యతారాగం అందుకున్న తెలంగాణ బీజేపీ నేతలు..!
ఐక్యతారాగం అందుకున్న తెలంగాణ బీజేపీ నేతలు..!
పాత వాహనాలు వాడుతున్న వారికి గుడ్ న్యూస్.. ఇకపై ఆ నిబంధన ఉండదు..
పాత వాహనాలు వాడుతున్న వారికి గుడ్ న్యూస్.. ఇకపై ఆ నిబంధన ఉండదు..
బాహుబలి స్టంట్‌..నడుంలోతు వరదలో తలపై టూ వీలర్ పెట్టుకొని..
బాహుబలి స్టంట్‌..నడుంలోతు వరదలో తలపై టూ వీలర్ పెట్టుకొని..
సర్వేంద్రియానం నయనం ప్రధానం.. కంటి ఆరోగ్యానికి అద్భుతమైన ఫుడ్స్..
సర్వేంద్రియానం నయనం ప్రధానం.. కంటి ఆరోగ్యానికి అద్భుతమైన ఫుడ్స్..