Viral Video: బాహుబలి స్టంట్‌..నడుంలోతు వరదలో తలపై టూ వీలర్ పెట్టుకొని..

పోటెత్తిన వరదలు ఊళ్లకు ఊళ్లనే ముంచేశాయి. ప్రజలు కట్టుబట్టలతో ప్రాణాలను రక్షించుకునేందుకు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌లో కనిపించిన వరద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ప్రాంతంలో వరదలు రావడంతో ఓ యువకుడు తన బైక్‌ను కాపాడుకునేందుకు తలపై మోసుకెళ్తున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి.

Viral Video: బాహుబలి స్టంట్‌..నడుంలోతు వరదలో తలపై టూ వీలర్ పెట్టుకొని..
Man Lift Bike On Head
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 12, 2024 | 5:04 PM

వాయుగుండం ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల రైళ్లను కూడా రద్దు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. కుండపోత వర్షాల కారణంగా చాలా చోట్ల భారీగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభంవించింది. కొన్ని చోట్ల పోటెత్తిన వరదలు ఊళ్లకు ఊళ్లనే ముంచేశాయి. ప్రజలు కట్టుబట్టలతో ప్రాణాలను రక్షించుకునేందుకు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌లో కనిపించిన వరద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ప్రాంతంలో వరదలు రావడంతో ఓ యువకుడు తన బైక్‌ను కాపాడుకునేందుకు తలపై మోసుకెళ్తున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి.

దామోహ్ జిల్లాలోని మాగ్రోన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని సున్వాహ అనే గ్రామానికి సబంధించిన ఒక సీసీ ఫుటేజ్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బటియాగఢ్ నుంచి టూ వీలర్ మీద ఓ యువకుడు స్వగ్రామం మగ్రాన్ వెళ్తున్నాడు. బైక్‌పై వెళ్తున్న అతడు బ్రిడ్జీ వద్దకు రాగానే వరద ప్రవాహం పెరిగింది. అప్పుడు టూ వీలర్ నడపడం వీలు పడలేదు. కష్టపడి కొనుకున్న కొత్త వాహనాన్ని వదిలి వేయాలని అనిపించలేదు. ఆ వాహనాన్ని తలపై పెట్టుకొని నడవడం ప్రారంభించాడు. వరద ప్రవాహం పెరుగుతోన్న.. దాదాపు 100 మీటర్ల వరకు నడిచాడు. తన టూ వీలర్‌తో రోడ్డు మీదకు చేరుకున్నాడు. నిజానికి అతను చేసింది ఫీటే.. వరద ప్రవాహంలో బండిని తలపై తీసుకెళ్లడం ఏంటి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలోనే యువకుడు చేసిన సాహసం అందరినీ ఆకర్షిస్తోంది. బాహుబలిలా తలపై బైక్‌తో వాగునీటిలో పూర్తిగా మునిగిపోయిన వంతెనపై నడుచుకుంటూ వెళ్తున్న ఆ దృశ్యం ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. చాలా మంది అతడు చేసిన పనికి భిన్నమైన అభిప్రాయాలు తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..