Jagan Selfie: సెల్ఫీకి ఛార్జ్ మెమో.. వివాదాస్పదమైన జైలు కానిస్టేబుల్ సెల్ఫీ..
వీఐపీలతో సెల్ఫీ దిగడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. సెల్ఫీల పిచ్చి ఏ స్టేజీకి చేరిదంటే ప్రమాదకర పరిస్థితుల్లో సెల్ఫీలు దిగి ప్రాణాలనే కోల్పోతున్నారు. అయితే ఇక్కడ జరిగిన సంఘటన అటువంటిది కాకపోయిన సెల్ఫీ పిచ్చి ఉద్యోగానికే ఎసురు తెచ్చి పెట్టింది. అసలేం జరిగిందంటే.. రెండు రోజుల క్రితం మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా జైలుకు వచ్చారు...
వీఐపీలతో సెల్ఫీ దిగడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. సెల్ఫీల పిచ్చి ఏ స్టేజీకి చేరిదంటే ప్రమాదకర పరిస్థితుల్లో సెల్ఫీలు దిగి ప్రాణాలనే కోల్పోతున్నారు. అయితే ఇక్కడ జరిగిన సంఘటన అటువంటిది కాకపోయిన సెల్ఫీ పిచ్చి ఉద్యోగానికే ఎసురు తెచ్చి పెట్టింది. అసలేం జరిగిందంటే.. రెండు రోజుల క్రితం మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా జైలుకు వచ్చారు. జిల్లా జైల్లో ఉన్న నందిగాం సురేష్ ను పరామర్శించేందుకు వచ్చిన ఆయన్ను చూసేందుకు పలువురు అభిమానలు ఎగబడ్డారు. ఆయన జైల్లోకి వెళ్లి సురేష్ ను పరామర్శించిన తర్వాత వచ్చి మీడియా పాయింట్ లో మీడియాతో మాట్లాడేందుకు సిద్దమయ్యారు.
ఆసమయంలోనే యూనిఫామ్ లో ఉన్న కానిస్టేబుల్ జగన్ వద్దకు దూసుకొచ్చింది. తనతో పాటు తన కుమార్తెను తీసుకొచ్చి ఆశీర్వదించాలంటూ వేడుకొంది. అంతేకాకుండా తన కుమార్తెతో సెల్ఫీ దిగాలంటూ విజ్క్షప్తి చేసింది. వెంటనే ఆమె కుమార్తె కూడా జగన్ తో పాటు తన తల్లిని సెల్ఫీ తీసుకొంది. సెల్పీ తీసుకున్న సంతోషంలో ఎగిరి గంతులేసింది. ఆమె ఆనందానికి పగ్గ పట్టాలు లేకుండా పోయాయి. అయితే ఇదంతా మీడియా కెమెరాల ముందే జరగటం డ్యూటీలో, యూనిఫామ్ లో ఉన్న మహిళా కానిస్టేబుల్ వచ్చి సెల్పీ దిగడం అన్ని కెమెరాల్లో రికార్డైంది. వెంటనే ఆమె ఎవరన్న చర్చ మొదలైంది.
ఆమె పేరు ఆయేషా భాను అని ఆమె గుంటూరు జైల్లో వార్డెన్ గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. జగన్ అంటే ఆమె కుతూరు అభిమానం. ఆయన తన తల్లి పనిచేస్తున్న జైలు వద్దకే వస్తున్నాడని తెలుసుకోని తన తల్లిని బ్రతిమలాడి జగన్ తో సెల్ఫీ తీసుకునేందుకు జైలు వద్దకు వచ్చింది. ఆమె ఒక్కతే సెల్ఫీ దిగితే ఎటువంటి సమస్య ఉండేది కాదు. అభిమానులు ఎగబడటంతో ఆమె వెళ్లలేక డ్యూటీలో ఉన్న తన తల్లితో సహా సెల్ఫీ దిగడానికి వెళ్లింది. అదే ఇప్పుడు వివాదాస్పమైంది. సర్వీస్ రూల్స్ కు విరుద్దంగా వ్యవహరించిన ఆయేషా భానుకు ఛార్జి మెమో ఇచ్చారు. ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు. విధి నిర్వహణలో ఉన్న వారు సర్వీస్ నిబంధనలు పాటించాలని విరుద్దంగా వ్యవహరిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి