టీమిండియా వద్దు పొమ్మంది.. ఇంగ్లాండ్ రారమ్మంది.. విదేశీ గడ్డపై దుమ్మురేపిన కోహ్లీ ఫ్రెండ్

ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీ టోర్నీలో టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు చోటు దక్కలేదు. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు అతడ్ని ఎంపిక చేయలేదు బీసీసీఐ. అయితేనేం చాహల్ జైత్రయాత్ర ఆగిపోలేదు.

టీమిండియా వద్దు పొమ్మంది.. ఇంగ్లాండ్ రారమ్మంది.. విదేశీ గడ్డపై దుమ్మురేపిన కోహ్లీ ఫ్రెండ్
Rcb
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 17, 2024 | 11:49 AM

ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీ టోర్నీలో టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు చోటు దక్కలేదు. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు అతడ్ని ఎంపిక చేయలేదు బీసీసీఐ. అయితేనేం చాహల్ జైత్రయాత్ర ఆగిపోలేదు. ఇంగ్లాండ్‌లో రికార్డులు సృష్టిస్తున్నాడు ఈ ఆఫ్ స్పిన్నర్. అవునండీ.! టీమ్ ఇండియాకు దూరమైన యుజ్వేంద్ర చాహల్ ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్‌షిప్ టోర్నీ ఆడుతున్నాడు. నార్తాంప్టన్ షైర్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తోన్న చాహల్ 9 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు.

ఇది చదవండి: R అక్షరంతో పేరున్న వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదంటే.? ఆ విషయంలో జగమొండి

నార్తాంప్టన్‌ కౌంటీ గ్రౌండ్‌లో జరిగిన కౌంటీ ఛాంపియన్‌షిప్ 47వ మ్యాచ్‌లో నార్తాంప్టన్‌షైర్, డెర్బీషైర్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నార్తాంప్టన్‌షైర్ 219 పరుగులకు ఆలౌటైంది. దీని తర్వాత తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన డెర్బీషైర్‌ను చాహల్ స్పిన్‌తో చిట్టడి చేశాడు. యుజ్వేంద్ర చాహల్ లెగ్ స్పిన్‌తో డెర్బీషైర్ బ్యాటర్లను కట్టడి చేసి 16.3 ఓవర్లలో కేవలం 45 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. దీని ద్వారా ప్రత్యర్థి జట్టు కేవలం 165 పరుగులకే ఆలౌట్ కావడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన నార్తాంప్టన్‌షైర్ జట్టు 211 పరుగులకే ఆలౌటైంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: బాలికతో 20 రోజులు ఓయో రూమ్‌లో.. చివరికి తను ఏం చేసిందంటే

చివరికి 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన డెర్బీషైర్‌కు యుజ్వేంద్ర చాహల్ మరోసారి షాక్ ఇచ్చాడు. ఈసారి 18 ఓవర్లు బౌలింగ్ చేసిన చాహల్ 54 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా డెర్బీషైర్ జట్టు కేవలం 132 పరుగులకే ఆలౌటైంది. ఈ 9 వికెట్లతో చాహల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 100 వికెట్లు పూర్తి చేయడం విశేషం.

ఇది చదవండి: టీ20లకే మొనగాడురా.! 12 ఫోర్లు, 5 సిక్సర్లతో కావ్యపాప ప్లేయర్ ఊచకోత

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..