Dhulipalla Narendra: టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రపై మరో కేసు, ఇవి వివ‌రాలు

మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పై మరో కేసు నమోదు అయ్యింది. సంగం డెయిరీ వ్యవహారంలో ఆయన ఇటీవలే బెయిల్ పై విడుదల అయ్యారు.

Dhulipalla Narendra: టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రపై మరో కేసు, ఇవి వివ‌రాలు
Tdp Leader Dhulipalla Narendra
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 06, 2021 | 5:35 PM

మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పై మరో కేసు నమోదు అయ్యింది. సంగం డెయిరీ వ్యవహారంలో ఆయన ఇటీవలే బెయిల్ పై విడుదల అయ్యారు. తాజాగా ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పైనా, సంగం డెయిరీ పాలకవర్గ సభ్యులపైనా విజయవాడలో కేసు నమోదైంది. కరోనా సమయంలో నిబంధనలు ఉల్లంఘించి మే 29న ఓ హోటల్ లో సమావేశం ఏర్పాటు చేయడంతో పటమట పీఎస్ లో కేసు నమోదు చేశారు. కర్ఫ్యూ అమల్లో ఉండగా సమావేశం జరిపారంటూ పటమట పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ కిశోర్ కుమార్ ఫిర్యాదు చేయడంతో, ఈ కేసు నమోదైంది. ఆ రోజు జరిగిన సమావేశానికి సంబందించి సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ధూళిపాళ్ల, తదితరులపై ఐపీసీ 269, 270, 34, 188 సెక్షన్లతో పాటు, అంటువ్యాధుల చట్టం కింద కేసు నమోదైంది. అయితే, తమపై కేసు నమోదు చేయడాన్ని సంగం డెయిరీ పాలకవర్గం ఖండించింది. తాము నిబంధనలకు అనుగుణంగానే సమావేశం నిర్వహించామని స్పష్టం చేసింది. దీనిపై పోలీసులు సంగం డెయిరీ కంపెనీ కార్యదర్శిని పిలిపించి విచారణ జరిపారు.

ఇటీవల మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‎కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీకత్తుతో పాటు ఇద్దరు ష్యూరిటీలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. 4 వారాల పాటు విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలో ఉండాలని ధూళిపాళ్లను కోర్టు సూచించింది. సంగం డెయిరీలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలు జరిగియంటూ ఆయనను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు .ఆయన గతంలో సంగం డెయిరీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో అవినీతి జరిగిందని ఆరోపణలు రావడంతో అరెస్ట్ అయ్యారు.

Also Read : బెజ‌వాడ‌లో కిలాడీ లేడీ.. మాయ చేసి.. ముంచేస్తుంది…

మీ నీడ ఎప్పుడైనా మిస్ అయ్యిందా.. అక్క‌డ మాత్రం అలాగే జ‌రిగింది.. వ‌స్తువుల షాడోలు కూడా క‌నిపించ‌లేదు

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!