Tirupati Kidnap: యాచకురాలి బిడ్డను అపహరించిన మరో యాచకురాలు.. రెండు రోజులైనా దొరకని ఆచూకీ..

Tirupati Kidnap: తిరుపతిలోని అలిపిరి బాలాజీ లింక్ బస్టాండ్ వద్ద అదృశ్యమైన 4 నెలల బాలుడి ఆచూకీ ఇంకా లభ్యమవలేదు.

Tirupati Kidnap: యాచకురాలి బిడ్డను అపహరించిన మరో యాచకురాలు.. రెండు రోజులైనా దొరకని ఆచూకీ..
Kidnapped
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 05, 2021 | 9:28 AM

Tirupati Kidnap: తిరుపతిలోని అలిపిరి బాలాజీ లింక్ బస్టాండ్ వద్ద అదృశ్యమైన 4 నెలల బాలుడి ఆచూకీ ఇంకా లభ్యమవలేదు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 2వ తేదీన అర్థరాత్రి సమయంలో బాలాజీ బస్టాండ్‌లో నిద్రపోయిన యాచకురాలి నుంచి 4 నెలల మగ బిడ్డను మరో యాచకురాలు అపహరించుకుపోయింది. ఉదయం లేచి చూడగా బిడ్డ కనిపించకపోవడంతో.. బాధిత యచకురాలు అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలుడు అపహరణకు గురైన ప్రాంతంలోని సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. నిద్రిస్తున్న మహిళ నుంచి ఆమె కొడుకును మరో యాచకురాలు ఎత్తుకెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. అది గుర్తించిన పోలీసులు.. మూడు రోజులుగా బాలుడిని ఎత్తుకెళ్లిన యాచకురాలి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. కాగా, మూడు రోజులైనా బాలుడి ఆచూకీ లభించకపోవడంతో బాధిత మహిళ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. తమ బాలుడిని సురక్షితంగా అప్పగించాలని పోలీసులు వేడుకుంటోంది.

కాగా కొన్ని నెలల క్రితం అలిపిరి బస్‌స్టాండ్ సమీపంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ బాలుడు కూడా అపహరణకు గురైన విషయం తెలిసిందే. ఈ కిడ్నాప్ కేసు అప్పట్లో పెను సంచలనంగా మారింది. దీనిపై విపరీతమైన ప్రచారం జరుగడంతో.. భయపడిపోయిన నిందితులు.. ఆ బాలుడిని విజయవాడలోని ఇంద్రకీలాద్రి వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. దాంతో ఆ కేసు కథ సుఖాంతమైంది. ఇప్పుడు ఈ బాలుడిని కూడా రక్షించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బృందాలుగా ఏర్పడి బాలుడిని అపహరించిన యాచకురాలిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు.

Also read:

19,300 అడుగుల ఎత్తులో 52 కి.మీ రహదారి.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయినది

Yoga Pose Parsva Konasana: అధిక కొవ్వు, కీళ్లనొప్పులతో బాధపడుతున్నారా అయితే ఈ ఆసనాన్ని ట్రై చేస్తే సరి..

Tuck Jagadish: రిలీజ్ విషయంలో వీడని డైలామా.. టక్ జగదీశ్ మళ్లీ ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నాడా ?

ఒకే రోజు 2 రెండు హాఫ్ సెంచరీలు.. విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్
ఒకే రోజు 2 రెండు హాఫ్ సెంచరీలు.. విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్
నకిలీ ఖాతాతో అశ్విన్ పొరపాటు: రోహిత్ భార్యతో సంభాషణ వైరల్!
నకిలీ ఖాతాతో అశ్విన్ పొరపాటు: రోహిత్ భార్యతో సంభాషణ వైరల్!
గతంలో ఒక మంత్రిగా, ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నా: కేటీఆర్
గతంలో ఒక మంత్రిగా, ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నా: కేటీఆర్
బాబర్ ఆజమ్ Vs ముల్డర్: కేప్ టౌన్ టెస్టులో రికార్డులు, వివాదాలు!
బాబర్ ఆజమ్ Vs ముల్డర్: కేప్ టౌన్ టెస్టులో రికార్డులు, వివాదాలు!
తెలంగాణలోనూ సినిమా టికెట్ రేట్ల పెంపు! దిల్ రాజు కీలక ప్రకటన
తెలంగాణలోనూ సినిమా టికెట్ రేట్ల పెంపు! దిల్ రాజు కీలక ప్రకటన
పంట పొలంలో ప్రత్యక్షమైన జింకపిల్ల..కుక్కల దాడి నుంచి కాపాడిన
పంట పొలంలో ప్రత్యక్షమైన జింకపిల్ల..కుక్కల దాడి నుంచి కాపాడిన
40 గంటల పాటు యూట్యూబర్ కు చుక్కలు..బాధితుడిసెల్ఫ్‌ వీడియో రిలీజ్
40 గంటల పాటు యూట్యూబర్ కు చుక్కలు..బాధితుడిసెల్ఫ్‌ వీడియో రిలీజ్
డాడీ మూవీ బాలనటి లేటెస్ట్ లుక్ స్టన్నింగ్ అంతే..
డాడీ మూవీ బాలనటి లేటెస్ట్ లుక్ స్టన్నింగ్ అంతే..
అయ్యో విశాల్‌కు ఏమైంది? వణికిపోతూ గుర్తుపట్టలేని స్థితిలో..వీడియో
అయ్యో విశాల్‌కు ఏమైంది? వణికిపోతూ గుర్తుపట్టలేని స్థితిలో..వీడియో
భారత్‌లో తొలి HMPV కేసు..? బెంగళూరులో గుర్తింపు
భారత్‌లో తొలి HMPV కేసు..? బెంగళూరులో గుర్తింపు