AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yoga Pose Parsva Konasana: అధిక కొవ్వు, కీళ్లనొప్పులతో బాధపడుతున్నారా అయితే ఈ ఆసనాన్ని ట్రై చేస్తే సరి..

Yoga Pose Parsva Konasana: మనిషి జీవితంలో ఆధునికత పేరుతో రోజు రోజుకీ మారుతున్న జీవన విధానం. మారిన ఆహారపు అలవాట్లు ఇక శరీరానికి తగినంత శ్రమ లేకపోవడంతో.. అనేక రోగాల బారినపడుతున్నారు...

Yoga Pose Parsva Konasana: అధిక కొవ్వు, కీళ్లనొప్పులతో బాధపడుతున్నారా అయితే ఈ ఆసనాన్ని ట్రై చేస్తే సరి..
Parsva Konasana
Surya Kala
|

Updated on: Aug 05, 2021 | 9:16 AM

Share

Yoga Pose Parsva Konasana: మనిషి జీవితంలో ఆధునికత పేరుతో రోజు రోజుకీ మారుతున్న జీవన విధానం. మారిన ఆహారపు అలవాట్లు ఇక శరీరానికి తగినంత శ్రమ లేకపోవడంతో.. అనేక రోగాల బారినపడుతున్నారు. అయితే ప్రతి చిన్న వ్యాధికి మెడిసిన్స్ వాడడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.. దీంతో రోజు కొంచెం శ్రద్ధ పెట్టి యోగాసనాలను వేస్తె.. చాలా వరకూ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. అంతేకాదు ఈ ఆసనాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో కీళ్లనొప్పులు, మలబద్దకం తో ఇబ్బందులు పడుతున్నవారు ఎక్కువ.. వీరు రోజు కనీసం ఒక 10 నిమిషాల పాటు పార్శ కోణాసనాన్ని వేస్తె.. ఈజీగా కీళ్ల నొప్పుల నుంచి విముక్తిపొందవచ్చు. ఈరోజు పార్శ కోనాశనం ఎలా వేయాలి.. కలిగే లాభాల గురించి తెలుసుకుందాం

పార్శ కోనాశనం వేయు పద్దతి:

మొదట నిటారుగా నిలబడాలి. తర్వాత ఊపిరి పీల్చుకొని పాదాలు ఒక మీటరు దూరం జరపాలి. అరచేతులు భూమివైపుగా ఉంచాలి తర్వాత నెమ్మదిగా గాలి వదులుతూ కుడి పాదాన్ని కుడివైపుగా తిప్పుతూ 90 డిగ్రీల కోణంలో వంచాలి. ఈ సమయంలో ఎడమకాలును స్టిఫ్ గా ఉంచాలి ఇప్పుడు కుడి అరచేతిని కుడికాలి పక్కగా ఉంచి ఎడమ చేతిని ఎడమ చెవి మీదుగా భూమికి సమాంతరంగా ఉంచాలి. ఈ స్థితిలో అర నిమిషం పాటు రిలాక్స్ గా ఉండాలి. తర్వాత గాలి పీలుస్తూ ముందుగా కాలును, తర్వాత చేతిని యథాస్థితికి తీసుకురావాలి. ఇదే విధంగా ఎడమవైపు కూడా చేయాలి .. ఇలా 8నుంచి 10 సార్లు చేయాలి

పార్శ కోనాశనం వలన కలుగు ఉపయోగాలు :

ఈ ఆసనం కాలి మడమలు, మోకాళ్లు మొదలైన జాయింట్స్ కు రిలాక్స్ నిస్తుంది. కీళ్లనొప్పులు , సయాటికాలను తగ్గిస్తుంది నడుము చుట్టూ ఉండే కొవ్వును తగ్గిస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది.

అయితే ఈ ఆసనం మోకాలి నొప్పులున్నవారు వేయకూడదు.. అంతేకాదు యోగాసనం వేయడానికి ముందు చిన్న చిన్న వర్మప్స్ ను చేయాలి

Also Read: Home Remedies For Hair Growth: జుట్టు అందంగా ఒత్తుగా జుట్టు పెరగడానికి ఎఫెక్టివ్ వంటింటి చిట్కాలు ..