AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఆంధ్రప్రదేశ్‌ నుంచి లద్దాఖ్ వరకు సైకిల్‌ పైనే..పెద్ద సాహసమే ఇది..

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంకు చెందిన ఏసు పర్యావరణాన్ని కాపాడండి అంటూ సైకిల్ యాత్ర ప్రారంభించాడు. 3500 కిలో మీటర్ల సైకిల్‌పై ప్రయాణించి లద్దాఖ్ చేరుకున్నాడు. దీంతో ఈ యువకుడిని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అభినందించారు.

AP News: ఆంధ్రప్రదేశ్‌ నుంచి లద్దాఖ్ వరకు సైకిల్‌ పైనే..పెద్ద సాహసమే ఇది..
Travelled Ladakh In Cycle
B Ravi Kumar
| Edited By: |

Updated on: Oct 30, 2024 | 1:09 PM

Share

పర్యావరణంలో మార్పుల కారణంగా రాబోయే రోజుల్లో మానవాళికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఇప్పటికీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూమిపై కాలుష్యం విపరీతంగా పెరిగిపోయి స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోతుందని హెచ్చరిస్తున్నారు. రాబోయే ప్రమాదాల నుంచి మానవజాతిని రక్షించుకోవడానికి ముందున్న ఒకే ఒక్క మార్గం పర్యావరణాన్ని కలుషితం కాకుండా కాపాడుకోవడమే. అడవులు అంతరించి పోవడంతో  భూమి ఉష్ణోగ్రతలు కూడా రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో కొందరు మొక్కలు నాటి  భూమిపై పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తగ్గించాలని ఎన్నో వినూత్న కార్యక్రమాలు సైతం చేపట్టారు. ఈ క్రమంలోనే పర్యావరణ హితం కోసం ఓ యువకుడు చేసిన సాహస యాత్రను పలువురు అభినందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఆ యువకుడు చేసిన సాహసానికి శెభాష్  అంటూ మెచ్చుకున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంకు చెందిన ఏసు అనే యువకుడు పర్యావరణాన్ని కాపాడండి అంటూ సైకిల్ యాత్ర ప్రారంభించాడు. భీమవరం నుండి నుండి లద్దాఖ్ కు 3500 కిలోమీటర్ల దూరం ఒక్కడే సైకిల్ పై యాత్ర సాగించాడు. స్వచ్చత, పర్యావరణ, పరిరక్షణే ధ్యేయంగా ఏసు చేపట్టిన సైకిల్ యాత్ర ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు కొనసాగాడు. భీమవరం నుండి సెప్టెంబర్ 18వ తేదీన సైకిల్ యాత్ర ప్రారంభించిన ఏసు విజయవంతంగా 3500 కిలో మీటర్ల సైకిల్ పై ప్రయాణించి లద్దాఖ్ చేరుకున్నాడు. లద్దాఖ్ చేరుకున్న తర్వాత తన సైకిల్ యాత్ర విజయవంతం అయిందని అక్కడ ఫోటోలు దిగి వాటిని తన ఎక్స్‌లో పోస్ట్ చేసాడు. యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసిన భీమవరం కుర్రోడిని మంత్రి నారా లోకేష్ అభినందించారు. ఇండియా వచ్చాక ఏసును కలుస్తానని, సవాలుతో కూడిన ప్రయాణం విజయవంతంగా ముగిసినందుకు అభినందనలు అని తన ఎక్స్‌లో ఖాతాలో మంత్రి లోకేష్ పోస్ట్ చేశారు.

నారా లోకేష్ చేసిన ట్విట్ ఇదిగో:

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి